బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు | PM Modi Visit Bengaluru To Meet ISRO Team On Chandrayaan 3 Moon Mission Success, Comments Viral - Sakshi
Sakshi News home page

PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు

Published Sat, Aug 26 2023 7:35 AM

PM Modi ISRO Visit In Benguluru On Chandrayaan 3 Success  - Sakshi

బెంగుళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు. 

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొని అనంతరం గ్రీస్ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుండి నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. బెంగుళూరు చేరుకోగానే అయన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.  

ఇప్పుడే నేను బెంగుళూరు చేరుకున్నాను. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి భారత దేశాన్ని గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలవాలని చాలా ఆత్రుతతో ఉన్నాను. వారి అంకితభావమే అంతరిక్ష రంగంలో వారు ఇన్ని ఘనతలు సాధించడానికి కారణం.' అని రాశారు. 

విమానాశ్రయం చేరుకున్నాక ఎయిర్పోర్ట్ వద్ద ఆయన కోసం ఎదురు చూస్తున్న వారికి అభివాదం తెలిపిన ఆయన అనంతరం  మాట్లాడుతూ.. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన వేళ నేనిక్కడ లేను.. అందుకే నన్ను నేను ఆపుకోలేకపోయాను. భారతదేశంలో అడుగుపెడుతూనే శాస్త్రవేత్తలను అభినందించేందుకు నేరుగా బెంగుళూరు వచ్చానన్నారు. ఈ సందర్బంగా ఆయన 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' అని నినదించారు. 

ఇది కూడా చదవండి: ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు

  

Advertisement
Advertisement