Condom Packet Helped UP Ambedkarnagar Police To Crack Details Of Brutal Murder - Sakshi
Sakshi News home page

కండోమ్‌ ప్యాకెట్‌లో బ్లైండ్‌ మర్డర్‌ కేసు రహస్యం.. ట్రైనీ పోలీసులకు కేస్‌ స్టడీగా..

Published Tue, Jun 27 2023 7:30 AM

Police Unearthed Blind Murder Case from Condom Packet - Sakshi

యూపీలోని అంబేద్కర్‌నగర్‌ పోలీసులు ఒక బ్లైండ్‌ మర్డర్‌ కేసును చేధించారు. ఇప్పుడు ఈ కేసు పోలీసు విభాగానికి చెందిన ట్రైనీ ఆఫీసర్లకు అధ్యయన అంశంగా మారింది. జూన్‌ 11న జిల్లాలోని బెవానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక స్కూలులో 90శాతం మేరకు కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఆ మృతదేహం ఎవరిదనేది పోలీసులు కనుగొనలేకపోయారు. అయితే వారికి ఆ మృతదేహం వద్ద ఒక కండోమ్‌ ప్యాకెట్‌ లభ్యమయ్యింది.

యూపీలోని అంబేద్కర్‌నగర్‌ పోలీసులు చేధించిన ఒక బ్లైండ్‌ మర్డర్‌ కేసు ఇప్పుడు పోలీసు విభాగంలోని ట​్రైనీ ఆఫీసర్లకు కేస్‌ స్టడీకి పనికివస్తోంది. వివరాల్లోకి వెళితే జూన్‌ 11న జిల్లాలోని బెవానాలో పోలీసులకు 90శాతం మేరకు కాలిన మృతదేహం లభ్యమయ్యింది. పక్కనే ఒక కండోమ్‌ ప్యాకెట్‌ కూడా ఉంది. దాని ఆధారంగా పోలీసులు ఈ కేసును చేధించారు. నిందితులను జైలుకు తరలించారు.

తగలబడిన మృతదేహం ఉందంటూ..
భీతరీడీహ్‌ గ్రామానికి చెందిన కొందరు ఒక స్కూలు బిల్డింగ్‌లో తగలబడిన స్థితిలో ఒక మృతదేహం ఉండటాన్ని గమనించి, పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం పురుషునిదిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్‌ టీమ్‌ను రప్పించి, పలు ఆధారాలు సేకరించారు.

ఢిల్లీ, యూపీలలో లభ్యమయ్యే కండోమ్‌ ప్యాకెట్‌..
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. లోతుగా దర్యాప్తు సాగించినా పోలీసులకు ఆశించినంత ప్రయోజనం కనిపించలేదు. అయితే పోలీసులకు సంఘటనా స్థలంలో ఒక కండోమ్‌ ప్యాకెట్‌ దొరికింది. ఈ బ్రాండ్‌ కండోమ్‌ ప్యాకెట్‌ ఢిల్లీ ఎన్‌సీఆర్‌, యూపీలలో లభ్యమవుతుందని గుర్తించారు.

ఈ ఆధారంతో ముందుకు సాగిన దర్యాప్తు..
పోలీసులు సర్వలెన్స్‌ సెల్‌ మాధ్యమంలో జిల్లాలోని ఏ మొబైల్‌ నంబర్ల లొకేషన్‌ ఘటనాస్థలానికి దగ్గరలో ఉందో తెలుసుకున్నారు. ఈ ఆధారంతో మృతుడు ఎవరో తెలుసుకోగల నాలుగు నంబర్లను ట్రేస్‌ చేశారు. తదుపరి దర్యాప్తులో సహరన్‌పూర్‌కు నలుగురు వ్యక్తులు సర్కస్‌ చూసేందుకు వెళ్లారని, వారిలో ఒకరు మిస్సయ్యారని తేలింది.

నిందితులలోని ఒకని చెల్లెలితో..
ఈ ఇన్‌పుట్‌ ఆధారంగా పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, ప్రశ్నించడంతో అదృశ్యమైన యువకుని పేరు అజబ్‌ సింగ్‌ అని వెల్లడయ్యింది. అతను ఈ నిందితులలో ఒకని చెల్లెలిని ప్రేమించాడని వారు తెలిపారు. ఈ విషయమై ఎన్నిసార్లు వారించినా అజబ్‌ సింగ్‌ తన తీరు మార్చుకోలేదని వారు పేర్కొన్నారు. 

హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టి..
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ యువతి సోదరుడు అతని స్నేహితులు కలిసి.. అజబ్‌ సింగ్‌ చేత మద్యం తాగించి, ఒక స్కూలు భవనంలోకి తీసుకువెళ్లి, రాళ్లతో మోది హత్య చేశారు. తరువాత ఆతని దగ్గరున్న అన్ని వస్తువులను అక్కడే పారవేశారు. వాటిలో కండోమ్‌ ప్యాకెట్‌ కూడా ఉంది. తరువాత అక్కడే ఉన్న కర్రలను ఉపయోగించి, ఆ మృతదేహాన్ని తగులబెట్టారు.

అంబేద్కర్‌నగర్‌ పోలీసులకు ప్రశంసలు..
ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి అజీత్‌ కుమార్‌ సింగ్‌మాట్లాడుతూ ఒక కండోమ్‌ ప్యాకెట్‌ ఆధారంగా బ్లైండ్‌ మర్డర్‌ కేసును చేధించిన విషయం తమ ఉన్నతాధికారులకు తెలిసిందన్నారు. దీంతో వారు అంబేదర్కర్‌ నగర్‌ పోలీసులను అభినందించారని, దీనిని కేస్‌ స్టడీ కోసం ఉపయుక్తమయ్యేలా మురాదాబాద్‌ పోలీస్‌ సెంటర్‌కు పంపించాలని నిర్ణయించారన్నారు. ఇది పోలీస్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థులకు ఉపయుక్తం కానుంది. 

ఇది కూడా చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్‌..

Advertisement
Advertisement