Presidential Election 2022: NDA Draupadi Murmu To File Nomination On 24th June - Sakshi
Sakshi News home page

Presidential Elections 2022: ద్రౌపది ముర్ముకు జెడ్ ప్లస్ భద్రత.. 24న నామినేషన్‌

Published Wed, Jun 22 2022 5:03 PM

Presidential Election 2022: Draupadi Murmu to File Nomination on 24th June - Sakshi

న్యూఢిల్లీ:  అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్ కమాండోల 'జెడ్ ప్లస్' భద్రతను ఆమెకు కల్పించినట్లు కేంద్ర అధికారులు బుధవారం వెల్లడించారు. జెడ్ ప్లస్ రక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత స్థాయి సెక్యురిటీ. 

24న నామినేషన్‌ 
ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎ‍న్నిక జరగనుంది. కాగా, కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే. (క్లిక్‌: అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ)

Advertisement
Advertisement