ఇండియాలో పబ్‌జీ మళ్లీ రానుందా?

10 Mar, 2021 18:40 IST|Sakshi

భారతదేశంలో పబ్‌జీ నిషేధం తర్వాత గత ఏడాది నవంబర్‌లో పబ్జీ మొబైల్ ఇండియా తిరిగి తీసుకురానున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ ప్రకటించింది. చైనా సంస్థ టెన్సెంట్ గేమ్స్ పబ్‌జీ నుంచి వైదొలిగిన తర్వాత పబ్‌జీ కార్పొరేషన్ "పబ్జీ మొబైల్ ఇండియా" ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గతంలో ప్రారంభించింది. అయితే, పబ్‌జీ ప్రియుల ఆశల మీద కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పబ్జీ మొబైల్ ఇండియా గేమ్ హింసను ప్రేరేపిస్తున్న ట్లు గతంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు .

ప్రస్తుతం అయితే అధికారికంగా పబ్‌జీ గేమ్ ను స్మార్ట్‌ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు. కానీ, భారతదేశంలోని పబ్‌జీ లవర్స్ పబ్‌జీ గ్లోబల్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పబ్‌జీ గ్లోబల్ వెర్షన్‌ను
డౌన్‌లోడ్ చేసుకోవడం 'చట్టవిరుద్ధం' కాదని గతంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి, దేశీయ గేమర్స్ వెబ్ నుంచి పబ్‌జీ మొబైల్ ఏపీకేలను డౌన్‌లోడ్ చేసుకొని ఆడవచ్చు. కానీ, ఏపీకే విషయంలో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ పబ్‌జీ మొబైల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలలో 'త్వరలో రానున్నట్లు' ట్యాగ్‌ను చూపిస్తున్నాయి.

పబ్‌జీ మొబైల్ ఇండియాకు సంబంధించి ఇప్పటికీ  ఎటువంటి అధికారిక అప్‌డేట్ లేదు. కానీ చైనా, వియాత్నంలో పబ్‌జీ మొబైల్ గ్లోబల్ అప్‌డేట్ వెర్షన్ 1.3ని తీసుకొచ్చింది. దీనిలో హిందీ వెర్షన్ కి కూడా  సపోర్ట్ చేసే సోర్స్ కోడ్ ఉంది. దీని బట్టి కొందరు ఇండియాలో మళ్లీ పబ్‌జీ మొబైల్ గేమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ వెర్షన్ లో కాకారిన్ మ్యాప్, కొత్త స్నిపర్ రైఫిల్‌లు అందించారు. ఈ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా(భారతదేశం మినహా) వినియోగదారుల కోసం డౌన్‌లోడ్ కోసం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. మీరు కూడా పబ్‌జీ మొబైల్ డౌన్‌లోడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

చదవండి:

దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు