చాలా ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న బ్రహ్మాస్త్ర మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌!!

14 Dec, 2021 14:55 IST|Sakshi

సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు దర్శకుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర మూవీ ట్రైలర్‌ మ్యాజిక్‌తో ప్రేక్షకులను అలరించడానికి వారి ముందుకు రానుంది. అయితే రణబీర్ కపూర్, అమితా బచ్చన్, అలియా భట్, నాగార్జున, మౌని రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రం దాదాపు 4 సంవత్సరాల నుండి నిర్మాణంలోనే ఉంది. బాలీవుడ్‌ మునుపెన్నడూ చూడని విభిన్నమైన కాన్సెప్ట్‌తో అయాన్ ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. అందుకే ఇది పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ ప్రస్తుతం ఈ చిత్రం ప్రేక్షకులను అలంకరించడానికి సిద్ధంగా ఉంది. 

(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)

అయితే బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ రేపు విడుదల కానుండగా, మొదటి టీజర్ ఈరోజు వెబ్‌లోకి వచ్చింది.  అమితాబ్ బచ్చన్ గాత్రం అందించిన ఈ చిత్రంలో రణబీర్‌ను శివగా పరిచయం కానున్నాడు. అయితే షర్ట్ లేకుండా ఆర్‌కే మండుతున్న మంటల మధ్యలో కనిపిస్తాడు. అయితే ఈ సినిమా పోస్టర్‌ విడుదలతోపాటు అధికారికంగా విడుదల తేదీని కూడా త్వరలో  ఈ చిత్ర బృందం ప్రకటించనుంది.

(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..)

మరిన్ని వార్తలు