Sakshi News home page

ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు!

Published Thu, Sep 14 2023 9:47 AM

Salesman Killed Girlfriend Dead Body Kept on Bike Petrol Set Fire - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాలో ఇటీవల పోలీసులకు ఒక ఇనుపరేకు బాక్సులో 16 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆమె ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర శ్రీవాస్తవ ఈ యువతిని హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. 

మృతురాలితో గతంలో ఉపేంద్రకు అఫైర్ నడిచిందని, అయితే ఆమె మరొక యువకునితో సన్నిహితంగా ఉంటుండంతో ఉపేంద్ర ఆమెను హెచ్చరించాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమె ఉపేంద్ర మాటలను పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర ఆమెను హత్య చేశాడు. తరువాత బజారుకు వెళ్లి, ఒక ఐరన్‌ బాక్సు కొనుగోలు చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆ బాక్సులో ఉంచి, దానిని బైక్‌కు కట్టి 40 కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఆ బాక్సును వదిలేసి వచ్చాడు. ఈ సంగతి ఇక పోలీసులకు తెలియదని ఉపేంద్ర భావించాడు. అయితే అతను ఊహించని విధంగా పోలీసులు అతనిని పట్టుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపేంద్ర శ్రీవాస్తవ తాను ఉంటున్న ఇంటికి సమీపంలోని 16 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర వారణాసిలోని మహామాన్పురి కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానిలో వారిద్దరూ ఉండసాగారు. సాయంత్రం కాగానే ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయేవారు. ఇంతలో ఉపేంద్రకు ఆ యువతి ఎవరితోనే మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చింది. ఆమెను ఈ విషయమై నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య వివాదం నెలకొంది. 

ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన ఉపేంద్ర ఆమెను గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని బాక్సులో పెట్టి, దానిని బైక్‌కు కట్టి వారణాసికి 40 కిలోమీటర్ల దూరంలోని బదోహీ నేషనల్‌ హైవే మీదుగా లాలానగర్‌ సమీపంలోని అడవులలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాక్సును కిందకు దించి, బైక్‌ ట్యాకులోని పెట్రోల్‌ బయటకు తీసి, దానితో బాక్సుకు నిప్పంటించాడు. ఇలా చేయడం ద్వారా తన నేరాన్ని ఎవరూ గ్రహించలేరని ఉపేంద్ర భావించాడు.

అయితే స్థానికులు ఈ అనుమానాస్పద బాక్సును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు హైవేలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటిలో నిందితుడు తన బైక్‌కు ఈ బాక్సును కట్టి ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. బైక్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు నిందితుడు ఉపేంద్ర శ్రీవాస్తవ్‌ను అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు తదపరి చర్యలు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు?

Advertisement
Advertisement