ఆగని మారణహోమం.. కల్తీ మద్యం కాటుకు మరో ఆరుగురు బలి

14 Dec, 2022 11:16 IST|Sakshi

పట్నా: కల్తీ మద్యానికి బిహార్‌లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా మరో ఆరుగురు మద్యం కాటుకు బలయ్యారు. ఛాప్రా జిల్లాలోని సరన్‌ ప్రాంతం ఐసౌపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దోయిలా గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించిన క్రమంలో ఐదుగురు గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మరికొంత మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 

మృతులు సంజయ్‌ సింగ్‌, హరిందర్‌ రామ్‌, కునాల్‌ సింగ్‌, అమిత్‌ రంజన్‌లు సహా మరికొంత మంది కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యారని మధురా డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? అనే విషయంపై విచారిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు