చేపల కోసం వస్తే కొండచిలువ చిక్కింది; ఫోటోలు వైరల్‌

4 Jul, 2021 19:24 IST|Sakshi

భువనేశ్వర్‌: పామును దూరం నుంచి చూస్తేనే హడలెత్తిపోతాం. అలాంటిది చేపలకు బదులు కొండచిలువ చిక్కితే ఆ జాలరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొండి.  కొంత‌మందికి ఇలాంటి సంద‌ర్భాలు అప్పుడ‌ప్పుడూ ఎదుర‌వుతూనే ఉంటాయి. తాజాగా ఒడిశాలోని క‌ల‌హండి జిల్లాలోని గొల‌ముందా ఏరియాలో ఉన్న గంగా సాగ‌ర్ చెరువులో  జాల‌రి రాజ్‌మల్‌ దీప్‌కి ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. చేప‌ల కోసం వ‌ల‌వేస్తే ఏకంగా ఏడు అడుగుల పొడ‌వున్న కొండ‌చిలువ చిక్కింది.

అదృష్టం బాగుండి ఆ కొండచిలువ అతనిపై దాడి చేయలేదు. దీంతో ఒక్క‌సారిగా షాకైన అత‌ను ఆ త‌ర్వాత తేరుకుని అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చాడు. ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న అధికారులు కొండచిలువ‌ను వ‌ల నుంచి విడిపించి తీసుకెళ్లి స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు. ప్రస్తుతం కొండచిలువకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు