Modi Government Will Soon Launch Sandes App Domestically With Features Alternative To WhatsApp - Sakshi
Sakshi News home page

వాట్సాప్‌కు షాక్ ‌: కొత్త దేశీ యాప్

Published Mon, Feb 8 2021 11:29 AM

 Some government officials reportedly using Sandes,WhatsApp alternative - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సొంతమైన ప్రముఖ మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారీ షాకిచ్చేలా కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. తాజా  నివేదికల ప్రకారం ప్రభుత్వం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో  దేశీయంగా ఒక యాప్‌ను త్వరలోనే లాంచ్‌  చేయనుంది.  సందేశ్‌ పేరుతో ఆవిష్కరించ నున్న ఈ యాప్‌  టెస్టింగ్‌ ప్రక్రియిను ఇప్పటికే  మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్‌  ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరీక్షకు అందుబాటులో ఉంచింది

వాట్సాప్‌ లాంటి యాప్‌ను ఆవిష్కరించే ప్రణాళికలను ప్రభుత్వం గత ఏడాది ధృవీకరించింది. జిమ్స్ (జీఐఎంఎస్‌) అనే పేరుతో ఈ ప్రభుత్వ యాప్‌ను లాంచ్‌ చేయనుందనే అంచనాలు వెలువడ్డాయి. కానీ దేశీయంగా ‘సందేశ్‌’ పేరుతో తీసుకురానుందట. ఈ నేపథ్యంలోనే దీన్ని వినియోగానికి కూడా సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీన్ని వాడుతున్నట్టు సమాచారం. అంతర్జత సమాచారం మార్పిడి కోసం  ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారులు సందేశ్‌ యాప్‌ను  ఉపయోగిస్తున్నారని ఒక నివేదికలో బిజినెస్ స్టాండర్డ్ సోమవారం తెలిపింది.  ప్రస్తుతం ఈ యాప్‌ అధీకృత ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమని పేర్కొంది. ఓటీపీ ఆధారిత లాగిన్‌ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్‌ సహా ఆధునిక చాటింగ్ చాప్‌ల ఫీచర్లతో ఐఓఎస్‌,ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంలకు మద్దతునిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, (ఎన్ఐసీ)  బ్యాకెండ్  సపోర్టు అందిస్తోంది.

Advertisement
Advertisement