ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు | Sakshi
Sakshi News home page

ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Published Mon, Mar 4 2024 11:06 AM

Supreme Court Says No Immunity To MLAs And MPs In Bribe For Vote Cases - Sakshi

లంచాలు తీసుకుంటే మినహాయింపు లేదు

ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే

డబ్బులు తీసుకుని చట్టసభల్లో ప్రశ్నలు అడగడం తప్పే

లంచం తీసుకుని ఓట్లు వేయడం తప్పే

ప్రజా ప్రతినిధులు తప్పులు చేస్తే ఎలాంటి మినహాయింపు లేదు

పీవీ నరసింహారావు, జెఎంఎం కేసులో సుప్రీంకోర్టు తీర్పు

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదురుకోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన జేఎంఎం ముడుపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో ముఖ్యాంశాలు

  • లంచాల కేసుల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు
  • లంచాల కేసులో ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు
  • లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగినా విచారణ ఎదుర్కోవాల్సిందే
  • లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ఓటు వేయడం తప్పే, విచారణ ఎదుర్కోవాల్సిందే
  • చట్టసభల్లో డబ్బులు తీసుకొని  ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఎందుకుండాలి?
  • 1998లో పీవీ నరసింహారావు కేసులో అయిదుగురు జడ్జిల తీర్పును కొట్టేసిన ధర్మాసనం 
  • ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడటం, లంచాలు తీసుకోవడం పార్లమెంట్ వ్యవస్ధ పనితీరును నాశనం చేస్తుంది
  • ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం

ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో రాజ్యాంగ రక్షణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ధర్మాసనం.. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ లేదు. లంచాలు తీసుకుని పార్లమెంటు, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగితే తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ధర్మసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది.

ఇదే సమయంలో 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ  ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు కేసులో నిందితులపై చర్యలు తీసుకోకుండా.. అప్పటి న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్ , పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement