విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు! | Sakshi
Sakshi News home page

విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!

Published Sat, Jun 10 2023 6:22 AM

Time has come for postal voting for NRIs - Sakshi

న్యూఢిల్లీ:  విదేశాల్లో నివసించే భారతీయులకు సైతం మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఇందుకోసం ఈ–పోస్టల్‌ బ్యాలెట్‌ వంటి టెక్నాలజీ ఆధారిత ఆధునిక విధానాలను ఉపయోగించాలని అన్నారు. మన దేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు.

రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం నిర్వాచన్‌ సదన్‌లో ‘భారత్‌–ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి, భారత ఎన్నికల సంఘం పాత్ర’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో 2022 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారుల(ట్రైనీలు)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు, కుట్రపూరిత ప్రచారం సాగుతున్నాయని అన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌(ఈటీబీపీఎస్‌) ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని  కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రతిపాదించింది. విదేశాల్లోని భారతీయుల్లో 1.15 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు అంచనా. 

Advertisement
Advertisement