టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Published Sun, Jan 3 2021 5:54 PM

Today Top News 3 January 2021 - Sakshi

లోకేష్‌ను హెచ్చరించిన మంత్రి కొడాలి
రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది ప్రతిపక్ష నేత చంద్రబాబే అని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయన్నారు. పూర్తి వివరాలు..

‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉనికి కోల్పోతామన్న భయంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. అశాంతి సృష్టించేందుకు ప్రతిపక్షం చేస్తున్న పనులు దురదృష్టకరమన్నారు. పూర్తి వివరాలు..

రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు
ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పూర్తి వివరాలు..

ఐతారం నాడు లగ్గం.. అర్సుకునేటోల్లు వీళ్లే
పెళ్లి.. ఇప్పుడు పెద్ద ఇవెంట్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అంతా ఇప్పుడు వెరైటీ వైపు పరుగులు పెడుతున్నారు. తమ పెళ్లి ఇతరుల కంటే భిన్నంగా.. చాలా చాలా క్రియేటీవ్‌గా ఉండాలని భావిస్తున్నారు. ఇక తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన శుఖలేఖనే వైరైటీగా ముద్రించాడు. పూర్తి వివరాలు..

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు లైన్‌ క్లియర్‌
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌కు డీసీజీఐ ఆదివారం శుభవార్త చెప్పింది.  కోవాగ్జిన్,  కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. పూర్తి వివరాలు..

ట్రంప్‌కి అమెరికా కాంగ్రెస్‌ షాక్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆయనకు గట్టి షాక్‌ ఇచ్చింది. ట్రంప్‌ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాలు..

అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?
ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు 5జీ వచ్చేస్తుంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే 5జీ ఇంటర్ నెట్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు..

30 ఏళ్లు పట్టించుకోలేదు: ప్రముఖ నటుడు
ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటారు. మధ్యప్రదేశ్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చిన శరత్‌ సక్సేనాకు కూడా సినిమాల్లోకి వెళ్లే ఓ రోజు వచ్చింది. కానీ గుర్తింపు రావడానికే 30 ఏళ్లు పట్టింది. తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను శరత్‌ సక్సేనా.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టారు. పూర్తి వివరాలు..

రోహిత్‌ బీఫ్‌ ఆర్డర్‌ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్‌!
ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నటీమిండియా జట్టులోని ఐదుగురు క్రికెటర్లు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువులయ్యారు. బయో బబుల్‌ నిబంధనలను ఉల్లంఘించిన రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్, న‌వ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలను ఐసొలేషన్‌కు తరలి వెళ్లాల్సి వచ్చింది.  పూర్తి వివరాలు..

ఘోర ప్రమాదం: 18 మంది మృతి 
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో  భవనం కూలి18 మంది మృతి చెందారు.మురాద్‌నగర్‌ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోయిందిపూర్తి వివరాలు..

Advertisement
Advertisement