ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు! | Sakshi
Sakshi News home page

Year End 2023: 5 వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!

Published Tue, Dec 26 2023 11:00 AM

Top Diseases Year Ender 2023 - Sakshi

చివరిదశకు వచ్చిన 2023లో మనం చాలా చూశాం. అంతకన్నా ఎక్కువగానే నేర్చుకున్నాం. కాలంతో పాటు మన జీవన విధానం కూడా ఎంతగానో మారిపోయింది. ఈ జీవనశైలి వల్ల చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఈ సంవత్సరం కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు తలెత్తాయి. 

2024ని స్వాగతించే ముందు 2023లో మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన వ్యాధుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తద్వారా రాబోయే సంవత్సరంలో ఈ వ్యాధులతో పోరాడేందుకు మనమంతా సన్నద్దంగా ఉండగలుగుతాం. 2023లో మానవాళి ఎదుర్కొన్న ప్రధాన వ్యాధులేమిటో ఇప్పుడు చూద్దాం..
 
1. గుండె జబ్బులు
ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు (హృద్రోగాలు) అధికమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో గుండె జబ్బుల ముప్పు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. హృదయాన్ని కాపాడుకునేందుకు మెరుగైన జీవనశైలిని ఎంతో ముఖ్యం. అస్తవ్యస్త జీవనశైలి, మద్యం, ధూమపానం కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.  మన దేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. 

2. డెంగ్యూ 
ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి ముప్పు అధికంగా వెంటాడింది. వచ్చే ఏడాది కూడా ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డెంగ్యూతో  మృత్యువాత పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ వ్యాధి నివారణకు ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా చూసుకోవాలి. 

3. మిస్టీరియస్ న్యుమోనియా 
ఈ సంవత్సరం మిస్టీరియస్ న్యుమోనియా కేసులు పెరిగాయి. ఈ వ్యాధి చైనా, అమెరికాలో తీవ్రంగా కనిపించింది. ఈ వ్యాధి చైనాలో అధికంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి పిల్లలలో అధికంగా కనిపించింది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న కారణంగానే వారు త్వరగా న్యుమోనియాకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు అధికంగా కనిపించనప్పటికీ, ఈ వ్యాధి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
4. వైరల్, ఇన్ఫెక్షన్ 
నిపా వైరస్ ముప్పు ఈ సంవత్సరం  అధికంగా కనిపించింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్ ఇది. గబ్బిలాలతో పాటు పందులు, మేకలు, కుక్కలు, పిల్లుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.  ఈ వ్యాధి ముప్పు మన దేశంలో అధికంగా ఉంది. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతుంటారు.
 
5. కిడ్నీ సంబంధిత వ్యాధులు
ఈ సంవత్సరం కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు కూడా మనదేశంలో అధికంగా కనిపించింది. అస్తవ్యస్త జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం మొదలైనవి కిడ్నీ సమస్యలకు కారణమని వైద్యులు చెబుతుంటారు. 
ఇది కూడా చదవండి: పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..

Advertisement
Advertisement