కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం.. | Sakshi
Sakshi News home page

Parshottam Rupala: కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..

Published Mon, Jan 8 2024 8:26 AM

Union Minister Carrying Boat Stuck In chilika Lake For 2 Hours - Sakshi

భువనేశ్వర్‌: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.  వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల  ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో  చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపో​యాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు.

సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన  చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ  ఘటనతో కృష్ణా ప్రసాద్‌ ప్రాంతంలో మంత్రి  పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

చదవండి: Delhi: కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి!

Advertisement
Advertisement