ట్రెడ్‌మిల్‌ మీద వాకింగ్‌! 12 గంటల్లో ఏకంగా..

28 Dec, 2021 20:00 IST|Sakshi

లక్నో: సాధారణంగా చాలా మంది యువత.. సరైన శరీరాకృతి, ఆరోగ్యం కోసం జిమ్‌లలో వ్యాయామాలు చేస్తుంటారు. దీని కోసం​ ప్రత్యేకంగా ట్రేడ్‌ మిల్‌, డంబెల్స్‌, సైక్లింగ్స్‌ మొదలైన ఎక్విప్‌మెంట్‌ ఉంటాయి. ఈ క్రమంలో వాటితో గంటల కొలది వ్యాయమం చేసి శరీరంలోకి కొవ్వును తగ్గించుకుంటారు. వీటిని జిమ్‌లో ట్రైనర్‌ సమక్షంలో చేస్తుంటారు. అయితే, యూపీకి చెందిన జైనూల్‌ అబేదిన్‌ అనే వ్యక్తికి జిమ్‌ చేయడం అంటే ఇష్టం. ఇతడిని గ్రామస్థులు ‘మొరాదాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌’ అని పిలుస్తారు.

ఇతనికి ట్రెడ్‌మిల్‌పై నడవటం అంటే ఎంతో ఇష్టం. తాజాగా, ఇతను ట్రెడ్‌మిల్‌పై 12 గంటలపాటు ఏకధాటిగా 66 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాడు. దీంతో ప్రస్తుతం ఇతను వార్తల్లో నిలిచాడు. ఇతడి ట్రెడ్‌మిల్‌ విన్యాసాన్ని చూడటానికి జిల్లాల నుంచి అధికారులు పెద్దఎత్తున యూపీకి తరలివచ్చారు. ఈ ‍క్రమంలో జైనూల్‌ను  ఉత్సాహపరిచారు. గెలవగానే అతనిపై సభ్యులు పూలవర్శం కురిపించారు.

ఇప్పటికే జైనూల్‌.. న్యూఢిల్లీలోని ఇండియాగేట్‌ నుంచి ఆగ్రా, జైపూర్‌కు ప్రయాణించి మరల ఢిల్లీ చేరుకున్నాడు. ఈ పోటీని ఇతను 7 రోజులు 22 గంటలలో పూర్తిచేశాడు. ఈ అరుదైన ఘనతతో.. ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అదే విధంగా కరోనా లాక్‌డౌన్‌ కాలంలో పోలీసుల గౌరవార్థం 50 కిలోమీటర్లు నడక సాగించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు