Viral: Chaiwali Priyanka An Economics Graduate Sets Up Tea Stall In Bihar - Sakshi
Sakshi News home page

Chaiwaali Priyanka: రెండేళ్ల ప్రయత్నాల తర్వాత..

Published Tue, Apr 19 2022 9:04 PM

Viral: Meet Chaiwaali Economic Graduate From Bihar - Sakshi

ఎంతసేపు.. ప్రభుత్వాలు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇ‍వ్వడం లేదని విమర్శించే బదులు.. స్వతహాగా ఏదో ఒక పనిలో దిగిపోవడం ఉత్తమమని సలహా ఇస్తోంది ప్రియాంక. రెండేళ్లపాటు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆమె అది ఫలించకపోవడంతో టీ దుకాణం తెరిచింది.

బీహార్‌ పాట్నాలో ఉమెన్స్‌ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్‌ నడిపిస్తోంది ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్‌) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. 

ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా?  అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్‌ ఓపెన్‌ చేసింది. ‌ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది.  రెగ్యులర్‌ టీతో పాటు పాన్‌, మసాలా, చాక్లెట్‌ టీ, బిస్కెట్లు అమ్ముతోందామె. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు సైతం ఉంచింది.

Advertisement
Advertisement