ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్‌ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది? | Sakshi
Sakshi News home page

Biggest Vegetable Market: ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్‌ ఏది?

Published Sun, Sep 10 2023 12:27 PM

Where is Asias Biggest Vegetable Market - Sakshi

ప్రతి వ్యక్తి వివిధ కూరలతో నిండిన ప్లేట్‌లోని ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాడు. దీని వెనుక రెండు కారణాలున్నాయి. మొదటిది ఇది కళ్లకు ఇంపుగా కనిపించడం. రెండవది మన శరీరానికి అవసరమైన రీతిలో పోషకాలను అందించడం. అయితే ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఎక్కడుందనే ప్రశ్న మీ మనస్సులో  ఎప్పుడైనా తలెత్తితే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అతిపెద్ద కూరగాయల మార్కెట్‌ కలిగిన ఘనత భారత్‌ ఖాతాలోనే  ఉందని తెలిస్తే ఎవరైనా చాలా సంతోషిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో ఉంది. ఆ మార్కెట్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని చాలామంది రైతులు ఆ మార్కెట్‌లో వ్యాపారం చేయాలని తపన పడుతుంటారు.

90 ఎకరాల్లో విస్తరించిన మార్కెట్‌
ఈ మార్కెట్ విస్తీర్ణం దాదాపు 90 ఎకరాలు. ఆజాద్‌పూర్ మండికి వెళ్లగానే ముందుగా పెద్ద గేటు కనిపిస్తుంది. దానిపై ‘చౌదరి హరి సింగ్ హోల్‌సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్‌పూర్’ అని రాసివుంటుంది. అక్కడ ప్రతిరోజూ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. భారతదేశంలో లభించే అన్ని రకాల కూరగాయలు ఇక్కడ కనిపిస్తాయి. చిన్న, పెద్ద వ్యాపారులు ఇక్కడ విరివిగా కనిపిస్తారు. డీల్ కుదుర్చుకున్న తర్వాత కొందరికి లాభం చేకూరుతుంది. మరికొందరు గిట్టుబాటు ధర లభించక డీలా పడుతూ కనిపిస్తారు. ఈ మార్కెట్‌లో మహిళలు కూడా అధికసంఖ్యలో కనిపిస్తారు. ఇంటి బాధ్యతలతో పాటు వారు కూరగాయల వ్యాపారాన్ని కూడా చక్కబెడుతుంటారు. 

1977లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ
మండి కమిటీల వివిధ కార్యకలాపాలు, సంక్షేమ పథకాలను నిర్వహించడానికి, నియంత్రించడానికి, మార్గనిర్దేశం చేయడానికి 1977లో ఆజాద్‌పూర్ మండిలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ ఏర్పాటయ్యింది. మండి పరిషత్ రైతులకు  గిట్టుబాటు ధర కల్పించేందుకు వివిధ చట్టాలను రూపొందించింది. 
ఇది కూడా చదవండి: దేశ విభజనకు మౌంట్‌ బాటన్‌ కారకుడా? సరిహద్దులు ప్రకటించినప్పుడు ఏం జరిగింది?

Advertisement
Advertisement