‘సరితా.. ఏందే ఇది!’ చీమలు పెట్టిన చిచ్చు.. ఆ కాపురంలో భగ్గుమంది

26 Nov, 2022 19:47 IST|Sakshi

క్రైమ్‌: క్షణికావేశంలో నేరాలు జరుగుతుంటే.. వాటి వెనకాల  కారణాలు ఒక్కోసారి చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా అన్నానికి చీమలు పట్టడం అనే కారణం.. ఒక కాపురంలో చిచ్చుపెట్టాయి. ఆ గొడవ ముదిరి ఏకంగా ఒక ప్రాణం పోయింది. 

సరితా-హేమంతకు చాలా కాలం కిందట వివాహం అయ్యింది. వీళ్లకు ఇద్దరు ఆడబిడ్డలు. గురువారం రాత్రి హేమంత భోజనానికి కూర్చున్నాడు. ఈ క్రమంలో సరిత అన్నం ప్లేట్‌ అందించింది. అయితే.. అన్నంలో చీమలు ఉండడంతో నిలదీశాడు హేమంత. రోజూ అలాగే ఇస్తున్నావంటూ మండిపడ్డాడు. అది ఆమెకు కోపం తెప్పించింది. ఇద్దరి మధ్య  గొడవ పెద్దది అయ్యింది.  

సహనం కోల్పోయిన సరిత.. రాత్రి పడుకున్న తర్వాత భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఉదయం ఏం తెలియనట్లు కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అనుమానంతో హేమంత తండ్రి శశిభూషణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె గట్టిగా నిలదీయడంతో.. నిజం ఒప్పుకుంది. ఒడిషా సుందర్‌ఘడ్‌ జిల్లాలో గురువారం ఈ  నేరం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు