స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం | Sakshi
Sakshi News home page

స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం

Published Tue, Jan 25 2022 6:20 AM

Will not brook discrimination on the basis of religion says Anbil Mahesh  - Sakshi

చెన్నై: తమిళనాడులోని తంజావూరులో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిని విడిచిపెట్టమని తమిళనాడు స్కూలు ఎడ్యుకేషన్‌ మంత్రి అంబిల్‌ మహేశ్‌ చెప్పారు. ఈ కేసులో తల్లిదండ్రులకు న్యాయం దక్కేలా చూస్తామన్నారు. ఈ కేసుపై విచారణ జరుగుతోందని సోషల్‌ మీడియాలో ప్రజలు దీనిని రాజకీయం చేయొద్దని అన్నారు. తంజావూర్‌ మిషనరీ స్కూల్లో ఇంటర్‌ చదివే విద్యార్థిని వార్డెన్‌ తన ఇంట్లో వెట్టిచాకిరి చేయించుకుంటూ ఉండడంతో దానిని భరించలేక జనవరి 9న విషం తీసుకుంది. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతూ జనవరి 19న తుది శ్వాస విడిచింది. వార్డెన్‌ ఇంటి పనులు చెయ్యలేక విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో సోషల్‌ మీడియా ఒక్కసారిగా భగ్గుమంది.

Advertisement
Advertisement