Viral: Woman Collapsed and Died During Workout at Bengaluru Gym - Sakshi
Sakshi News home page

Bengaluru Gym Video: జిమ్‌ చేస్తూనే కుప్పకూలిన మహిళ.. సీసీటీవీలో దృశ్యాలు.. క్షణాల వ్యవధిలో

Published Sun, Mar 27 2022 8:06 AM

Woman Collapsed and Died During Workout at Bengaluru Gym - Sakshi

బెంగళూరు: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా మహిళ కింద పడి మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. శనివారం ఉదయం మల్లేశ్వపాళ్యంలోని ఒక జిమ్‌లో వినయకుమారి (44) అనే మహిళ వ్యాయామం చేస్తూ కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనున్నవారు ఆమెను రక్షించాలని చూసిన క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయకుమారి ఐడీసీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. జిమ్‌ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement