Woman molested by auto driver, arrested from Uttar Pradesh - Sakshi
Sakshi News home page

నాటకీయ పరిణామంలో అత్యాచార బాగోతం వెల్లడి.. 2 నెలలకు నిందితుడు అరెస్ట్‌!

Published Mon, Jul 10 2023 10:49 AM

woman harassment by auto driver in mumbai - Sakshi

ముంబైలో ఒక మహిళపై ఆటోలో అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు ముంబైలో ఉంటూ, ఆటో నడుపుతుంటాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుని పేరు ఇంద్రజీత్‌ సింగ్‌. అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఆ యువతిపై దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. 

ఈ ఉదంతం ఎలా వెలుగు చూసిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం బాధితురాలికి రక్తస్రావం అయ్యింది. రెండు నెలల క్రితం బాధితురాలికి ఆపరేషన్‌ చేసి డెలివరీ చేశారు. బాధితురాలికి రక్తస్రావం అయిన నేపధ్యంలో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెకు వైద్యపరీక్షలు చేసే సమయంలో పలు ప్రశ్నలు అడగగా, ఆమె తనపై జరిగిన ఘోరం గురించి చెప్పింది. దీంతో వైద్యులు ఈ విషయమై సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన బంధువుతో పాటు బెలాపూర్‌ వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి నవీముంబై వచ్చేందుకు ఆటో బుక్‌ చేసుకుంది. అయితే ఆటో డ్రైవర్‌ ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. 

యూపీకి పారిపోయిన డ్రైవర్‌
ఆ ప్రదేశంలో డ్రైవర్‌ ఇంద్రజీత్‌ ముందుగా ఆమెపై దాడి చేశాడు. తరువాత ఆమెపై అత్యాచారం జరిపి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.  తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌ చేరుకున్నాడు.

ఆటో యజమానిని విచారించడంతో..
బాధితురాలి ఫిర్యాదు అనంతరం పోలీసులు ఆ ఆటో యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు యూపీలో దాక్కున్న నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
ఇది కూడా చదవండి:  ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందు​కు పంపిస్తున్నారంటే..

Advertisement
Advertisement