వైరల్‌: కరోనా నాశనం కోసం.. వేలాదిగా మహిళలు

5 May, 2021 20:43 IST|Sakshi

అహ్మదాబాద్‌: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాలు ఖాతరు చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, మాస్క్‌, శానిటైజరే మనకు రక్ష అని ఎంత ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో వందల మంది ఆడవాళ్లు నెత్తిన నీళ్ల బిందెలు పెట్టుకుని.. కరోనాను నాశనం చేయాలంటూ పాటలు పాడుతూ.. రోడ్డు మీదకు వచ్చారు. 

వీరంతా ఒకరి మీద ఒకరు పడుతున్నట్లు దగ్గర దగ్గరగా నిల్చుని ఉన్నారు. వీరిలో చాలా మందికి మాస్క్‌ లేదు. కోవిడ్‌ విజృంభణ వేళ ఇంత మంది ఇలా ఒకే చోట గుంపుగా చేరడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. 23 మందిని అరెస్ట్‌ చేశారు. స్థానికంగా ఉన్న ఆలయంలో నీటితో పూజలు చేస్తే కరోనా తగ్గుతుందనే ఉద్దేశంతో వీరు ఇలా చేసినట్లు వెల్లడించారు.

చదవండి: వైరల్‌: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు