Uttar pradesh: YouTuber Arrested Filming Video Inside Nidhivan Raj During Night - Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ మరోసారి అరెస్ట్‌.. పవిత్ర స్థలంలో వీడియో చిత్రీకరణ

Published Mon, Nov 15 2021 12:59 PM

YouTuber Arrested Filming Video Inside Nidhivan Raj During Night In Uttar pradesh - Sakshi

మధుర: యూట్యూబర్లు పర్యటక ప్రాంతాలు, ట్రావెల్‌, టెంపుల్స్‌ సందర్శనకు సంబంధించిన వీడియోలను తీసి తమ యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు. అయితే ఓ యూట్యూబర్‌ తీసిన వీడియో అతన్ని వివాదంలోకి నెట్టడమే కాక అరెస్ట్‌ అయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్‌ బృందవనంలోని పవిత్ర స్థలంగా భావించే ‘నిధివన్ రాజ్‌’ స్థలాన్ని గౌరవ్‌ శర్మా అనే యూట్యూబర్‌ వీడియో తీశాడు.

చదవండి: మెక్‌డొనాల్డ్స్‌ ‘టాయిలెట్‌’ వివాదం

ఆ స్థలం రాధాకృష్ణులకు సంబంధించిన ఏకాంత స్థలమని నిధివన్‌ రాజ్‌ పూజారుల నమ్మకం. అయితే అక్కడ రాత్రి సమయంలో వీడియోలు చిత్రీకరించడం నిషేధంలో ఉంది. గౌరవ్‌ శర్మా అక్కడ రాత్రి సమయంలో తీసిన వీడియోను తన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వీడియో అప్‌లోడ్‌ చేసిన తర్వాత మళ్లీ డిలీట్‌ కూడా చేశాడు. అయితే ఆ వీడియో అప్పటికే వైరల్‌గా మారటంతో కొంతమంది పూజారులు నిరసన తెలిపి అభ్యంతరం వ్యక్తంచేశారు. నిధివన్‌ రాజ్‌ పూజారి రోహిత్ గోస్వామి ఫిర్యాదు మేరకు బృందావనం పోలీసులు గౌరవ్‌శర్మాను అరెస్ట్‌ చేశారు.

ప్రస్తుతం గౌరవ్‌ను జ్యుడీషియల్‌ కస్టడికి తరలించినట్లు పోలీసు అధికారి మార్తాండ్‌ ప్రకాశ్‌సింగ్‌ వెల్లడించారు. నవంబర్‌ 6వ తేదీ తన సోదురుడు ప్రశాంత్‌, స్నేహితులు మోహిత్‌, అభిషేక్‌లో కలిసి గౌరవ్‌ శర్మా నిధివన్‌రాజ్‌ను చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే గౌవర్‌ శర్మా గతంలో తన పెంపుడు కుక్కకు బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరవేసిన ఘటనలో  అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement