నేడు బీర్కూర్‌కు సీఎం రాక | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2023 1:18 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి : బీర్కూర్‌లోని తిమ్మాపూర్‌ తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహి స్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందు కు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో రానున్నారు. బుధవారం ఉదయం 9.50 గంటలకు బేగంపేటలోని ప్రగతి భవన్‌ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45కు బాన్సువాడ పట్టణంలోని అంగడిబజార్‌లో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిమ్మాపూర్‌లోని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు.

చికెన్‌ వ్యర్థాలపై మున్సిపల్‌

కమిషనర్‌ సీరియస్‌

తక్షణమే చర్యలు తీసుకోవాలని

ఆదేశాలు

నిజామాబాద్‌ నాగారం : నిజామాబాద్‌ నగరంలో చికెన్‌ వ్య ర్థాలను బాసర గోదావరి నదిలో పడేసి అ పవిత్రం చేస్తున్నారని ‘సాక్షి’లో ఈనెల 27న ప్రచురితమైన కథనానికి మున్సిపల్‌ కమిషనర్‌ చిత్రామిశ్రా స్పందించారు. ఎంహెచ్‌వో, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వెంటనే మీ ప్రాంతాల్లో పర్యటించి చికెన్‌ వ్యర్థాలు తీసుకెళ్లి గోదావ రి కలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. మీజోన్‌ కార్యాలయాల పరిధిలో ఉన్న చికెట్‌ షాప్‌లను తనిఖీ చేసి జరిమానాలు వేయాలని, లేకుంటే కచ్చితంగా ఆయా ఎస్సైలకు మెమోలిచ్చి శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తవ్వాలి

నిజామాబాద్‌ నాగారం : నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆదేశించారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంప్‌ కార్యాలయంలో అభివృద్ధి ప నులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వైకుంఠదామాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. నూతన మున్సిపల్‌ భవనం తుది దశకు చేరిందన్నారు.అహ్మదీబజార్‌లో సమీకృత మార్కెట్‌ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌ బీ డిప్యూటీ ఈఈ ప్రవీణ్‌, సంబంధిత ము న్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

పసుపు రైతుకు స్వల్ప ఊరట

క్వింటాలుకు రూ. 6 వేలకు పైగా పెరిగిన ధర

బాల్కొండ : పసుపు పంట సాగు చేసి మా ర్కెట్‌కు తరలించిన రైతుకు మంగళవారం మార్కెట్‌లో స్వల్పఊరట లభించింది. వా రం రోజులుగా మార్కెట్‌లో కొమ్ముకు క్వింటాలుకు రూ. 6 వేలకు పైగా ధర పలుకుతుంది. దుంపలకు రూ.5వేల పైన ధర పలికింది. గతనెల క్రితం కూడా వారం రోజుల పాటు ఇలానే ధర పెంచి మళ్లీ పసుపు తగ్గించారు. గతేడాది చివరిలో క్వింటాలుకు 8,500 వరకు ధర గరిష్టంగా పలికింది. అలాగే జొన్న పంటకు ప్రారంభంలో క్వింటాలుకు రూ. 4,200 పెట్టి కొనుగోలు చేసిన వ్యాపారులు వారం రోజుల్లోనే క్వింటాలుకు రూ. 3,800కు తగ్గించారు. దీంతో రైతులు జొన్నపంటను అమ్మకపోవడంతో మళ్లీ ధర పెంచారు. బాల్కొండ నియోజక వర్గంలో ఓ గ్రామంలో క్వింటాలుకు రూ. 3,910 కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి రైతులతో ఒప్పందం చేసుకున్నాడు.

1/2

2/2

Advertisement
Advertisement