ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన

Published Sat, Mar 18 2023 1:24 AM

-

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం సుర్భిర్యాల్‌ గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయి ల్‌ పామ్‌ సాగు, వేసవిలో ఆరుతడి పంటల సా గుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పసుపు పరిశోధన అధికారి డాక్టర్‌ మహేందర్‌ మాట్లాడుతూ.. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలు, మార్కెట్‌ సౌకర్యం గురించి వివరించారు. అలాగే వేసవిలో సాగు చేసే ఆరుతడి పంటల గురించి తెలిపారు. సర్పంచ్‌ సట్లపల్లి సవిత గణేష్‌, ఏవోలు హరికృష్ణ, సుమన్‌, ఏఈవో నరేష్‌, రవి కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

కమ్మర్‌పల్లి: మండల బాలల పరిరక్షణ కమిటీని శు క్రవారం ఎన్నుకున్నారు. మండల పరిషత్తు కార్యా లయంలో శుక్రవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఎంపీపీ గౌతమి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం కమిటీ చైర్మన్‌గా ఎంపీపీ గౌ తమి, కార్యదర్శిగా ఎంపీడీఓ సంతోష్‌రెడ్డి, కన్వీనర్‌గా ఐసీడీఎస్‌ సీడీపీవో, సభ్యులుగా ఎంఈవో ఆంధ్రయ్య, గ్రామ బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్లు, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మండల వైద్యాధికారి, పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌, సహాయ కార్మిక అధికారి, యువజన సంఘాల సభ్యులతో కూడిన కమిటీని నియమించారు.

Advertisement
Advertisement