Sakshi News home page

పాలిసెట్‌ ఫలితాల్లో సత్తా

Published Sat, May 27 2023 2:22 AM

కుటుంబ సభ్యులతో సాయికృష్ణ - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌/పెర్కిట్‌ : జిల్లా విద్యార్థులు శుక్రవారం విడుదలైన పాలిసెట్‌ ఫలితాల్లో సత్తా చాటారు. నగరంలోని గౌతమ్‌నగర్‌కు చెందిన మానేటి సంకీర్త్‌ రాష్ట్ర స్థాయిలో ఎంపీసీ విభాగంలో 6వ ర్యాంకు, ఎంబైపీసీ విభాగంలో 12వ ర్యాంకు సాధించాడు. ఎంపీసీలో120 మార్కులకు 118, ఎంబైపీసీలో 150 మార్కులకు 114.5 మార్కులు సాధించాడు. సంకీర్త్‌ నగరంలోని విశ్వోదయ పాఠశాలలో పదో తరగతి చదివి, 9.5 గ్రేడ్‌ సాధించాడు. అనంతరం పాలిటెక్నిక్‌ పరీక్ష రాశాడు. తండ్రి వెంకటరమణ, తల్లి శిరీష నగరంలోని కాకతీయ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు.

సాయికృష్ణకు 8వ ర్యాంక్‌

పెర్కిట్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీకి చెందిన గటడి సాయికృష్ణ పాలిసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. సాయికృష్ణ ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు 117 మార్కులు సాధించి 8వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. ఎంబైపీసీ విభాగంలో 112 మార్కులు సాధించి 27వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులు గటడి అశోక్‌, విజయ దంపతుల పెద్ద కుమారుడు సాయికృష్ణ స్థానిక బ్రిలియంట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు చదివాడు. పదో తరగతి ఫలితాల్లో అన్ని సబ్జెక్టులలో పదికి పది జీపీఏ సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచాడు. ఐఐటీలో ఉత్తమ ర్యాంకు సాధించి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలనే కుమారుని ఆకాంక్షలకు అనుగుణంగా తల్లితండ్రులు సాయికృష్ణను మాదాపూర్‌ నారాయణ కళాశాలలో చేర్పించారు.

అంజన్‌ కుమార్‌కు 55వ ర్యాంక్‌

నగరంలోని సాయిప్రియనగర్‌కు చెందిన చింతకింది అంజన్‌కుమార్‌ రాష్ట్రస్థాయి 55వ ర్యాంకు సాధించాడు. ఎంపీసీలో 120 మార్కులకు 114 వచ్చాయి. ఎంబైపీసీలో150 మార్కులకు 112.5 మార్కులతో 21వ ర్యాంకు పొందాడు. అంజన్‌కుమార్‌ తండ్రి శ్రీనివాస్‌ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి వసంత గృహిణి. అంజన్‌కుమార్‌ హైదరాబాదులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివి 9.5 గ్రేడ్‌ పొందాడు.

ఆరో ర్యాంకు సాధించిన సంకీర్త్‌

Advertisement
Advertisement