ఆర్మూర్‌ హీరోకు అంతర్జాతీయ అవార్డు | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ హీరోకు అంతర్జాతీయ అవార్డు

Published Wed, Jun 14 2023 12:56 AM

మట్టి కథ సినిమాలో అజయ్‌ వేద్‌  - Sakshi

ఆర్మూర్‌: ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లికి చెందిన అజయ్‌ వేద్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాను హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా ‘మట్టి కథ’లో ఉత్తమ నటనకు గాను ఇండో ఫ్రెంచ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ యాక్టర్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డును కై వసం చేసుకున్నాడు. ఈమేరకు సదరు సంస్థ మంగళవారం అవార్డును ప్రకటించింది.

ఈ అవార్డును ఇప్పటి వరకు తమిళంలో మమ్మనీతం అనే సినిమాలో స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతికి, బలగం సినిమాలో ప్రియదర్శికి మాత్రమే ద క్కింది. వీరి సరసన అజయ్‌ వేద్‌ నిలవడంతో మట్టి కథ సినిమాపై అటెన్షన్‌ బజ్‌ క్రియేట్‌ అయింది.

సినీరంగంలో ప్రవేశం ఇలా..
ఆర్మూర్‌లోని మానస హైస్కూల్‌ కరస్పాండెంట్‌ గణేష్‌, పద్మ కుమారుడైన అజయ్‌ వేద్‌ తన బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేసి రామానాయుడు స్టూడియోలో డిప్లొమా ఇన్‌ ఆక్టింగ్‌ పూర్తి చేసాడు. సినీ పరిశ్రమ లో అతనికి ఉన్న ఆసక్తితో పవన్‌ కడియాల దర్శకత్వంతో తెరకెక్కిన మట్టి కథ సినిమాలో హీరోగా అ వకాశం దక్కించుకున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రై లర్‌ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్ర సాద్‌ విడుదల చేశారు.

పల్లెటూరు అంటే పండు గలు, పబ్బాలకు ఇంటికి వచ్చి వెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో పల్లెటూరి కుర్రోడి ఆశ లు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి, మట్టితో అనుబంధం, మట్టిలో మధురానుభూతి ఎలా ఉంటుంది అనే అంశంపై సినిమా నిర్మించారు మొదటి సినిమాలోనే అజయ్‌ వేద్‌ అంతర్జాతీయ అవార్డును కై వసం చేసుకోవడంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు బంధువులు, తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.

Advertisement
Advertisement