లిక్కర్‌ స్కాం కేసు బలపడుతోంది | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాం కేసు బలపడుతోంది

Published Tue, Jun 20 2023 1:04 AM

డొంకేశ్వర్‌లో పార్టీలోకి చేర్చుకుంటున్న అర్వింద్‌ - Sakshi

పెర్కిట్‌(ఆర్మూర్‌): లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయమని జిల్లా ఎంపీ అర్వింద్‌ అన్నారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నందిపేట మండలం డొంకేశ్వర్‌, నికాల్పూర్‌ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు ఎంపీ అర్వింద్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లిక్కర్‌ స్కాం కేసు ఆలస్యమవుతుందని తెలంగాణ ప్రజలు నిరుత్సాహపడనవసరంలేదన్నారు. ఎంత ఆలస్యమయితే కేసు అంత బలోపేతం అవుతుందన్నారు.

అలాగే రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని ఎలాగైనా ఓడిస్తామన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను సాగనివ్వమన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ఏ విషయంలో బాగుపడిందో చెప్పాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అవినీతితో బ్రష్టుపట్టిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కరువయ్యారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో నార్లు వేసుకుని నిరీక్షిస్తున్న రైతులకు వర్షాలు రాక ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ వరకు రివర్స్‌ పంపింగ్‌ ద్వారా సాగు నీరందిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం చుక్క నీటిని వదలడం లేదన్నారు.

మహారాష్ట్ర, కర్నాటకలో డీజిల్‌, పెట్రోల్‌లో మిలిథం చేసే ఇథనాల్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే.. వరిని విరివిగా సాగు చేసే తెలంగాణలో మాత్రం ఒక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణలో 17 ఇథనాల్‌ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో వరి ధాన్యం సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా తరుగు పేరు తో రూ.12 వందల కోట్ల స్కాం జరిగిందన్నారు. ప్రఽ దాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు.

త్వరలో రాబోయే కామన్‌ సివిల్‌ కోడ్‌ ప్రయోజనం వల్ల ముస్లిం మహిళలు సైతం నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పైడి రాకేష్‌ రెడ్డి, పాలెపు రాజు, సాయి రెడ్డి, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement