పంచాయతీ కార్మికుల రాస్తారోకో | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్మికుల రాస్తారోకో

Published Tue, Aug 8 2023 12:56 AM

డిచ్‌పల్లిలో రాస్తారోకో చేస్తున్న జీపీ కార్మికులు   - Sakshi

డిచ్‌పల్లి: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ, జీపీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 33వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జీపీ కార్మికులు డిచ్‌పల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ఇరువైపులా అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మురళి, గంగాధర్‌ మాట్లాడుతూ.. జీపీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేసి, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు రాజేందర్‌, బాబు, రమేష్‌, నాగరాజు, శ్యాంసన్‌, భారతి, రాజేశ్వర్‌, భూమయ్య, రవి, రాము, సంతోష్‌, దుర్గ, బాబా, సాయిలు, గంగాధర్‌, మహేష్‌, బాలు పాల్గొన్నారు.

సిరికొండ: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ, గ్రామ పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలో సోమవారం రాస్తారోకో చేశారు. తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. నాయకులు రమేష్‌, సాయారెడ్డి, రాజన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

సిరికొండలో..
1/1

సిరికొండలో..

Advertisement
Advertisement