No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Oct 5 2023 1:22 AM

- - Sakshi

అంగన్‌వాడీల ముందస్తు అరెస్టు

సిరికొండ/ఖలీల్‌వాడి: జిల్లాకేంద్రంతోపాటు పలు మండలాల్లోని అంగన్‌వాడీ సిబ్బందిని పోలీసులు బుధవారం ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్‌ వెళుతున్న వారిని పోలీసులు అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మండలానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయులను పోలీసులు బుధవారం ముందస్తు అరెస్ట్‌ చేశారు. హైద్రాబాద్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి తరలకుండా వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బోరుబావి తవ్వకం

సిరికొండ: మండలంలోని కొండపూర్‌ గ్రామంలో బోరుబావి తవ్వకం పనులను జెడ్పీటీసీ మాన్‌సింగ్‌ ప్రారంభించారు. సర్పంచ్‌ రమేష్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ అబ్బాస్‌, ఉపసర్పంచ్‌ సుమన్‌, రహీం, రాంచందర్‌, రాజగంగారం పాల్గొన్నారు.

పీజీ తరగతులు ప్రారంభించాలి

నిజామాబాద్‌అర్బన్‌: గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో పీజీ రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు బుధవారం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సెప్టెంబర్‌ 1న ప్రారంభం కావాల్సిన తరగతులు ఇప్పటికీ కాకపోవడం సరికాదన్నారు. సంఘ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాలలో

న్యూట్రీషియన్‌ ఎగ్జిబిషన్‌

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో న్యూట్రీషియన్‌, ఫుడ్‌ టెక్నాలజీ విభాగాల ఆద్వర్యంలో బుధవారం న్యూట్రీషియన్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్‌ సతీష్‌, విద్యా సంస్థల చైర్మన్‌ మారయ్యగౌడ్‌ మాట్లాడారు. విద్యార్థులు ఆహార పద్ధతులు, అలవాట్లు, పౌష్టికాహారం తయారీ, నిల్వ పద్దతుల గురించి వివరించారు. ప్రిన్సిపాల్‌ రమణకుమార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కంటి పరీక్షలు

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని నాగారం 300 క్వార్టర్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేస్తామని సంస్థ ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌ వినోద్‌ అన్నారు. ఉపాధ్యాయులు, సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌అర్బన్‌: ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న నారాయణ హైస్కూల్‌పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు బుధవారం నగరంలో ఎంఈవో వినతిపత్రం అందజేశారు.

జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ అర్బన్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో ఇటీవల ఇంటర్‌ స్కూల్‌ ఖోఖో టోర్నమెంట్‌ పోటీలు నిర్వహించారు. అండర్‌–14 విభాగంలో విజయ్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్‌–17 విభాగం నుంచి ఐదుగురు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. .

హాకీ అకాడమికి ఎంపిక

ఇందల్వాయి: స్పోర్ట్‌ అకాడమీ ఆఫ్‌ తెలంగాణకి ఎల్లారెడ్డిపల్లె హైస్కూల్‌ విద్యార్థులు లావుడ్య అఖిల్‌, బోధన్‌ మల్లికార్జున్‌, లావుడ్య అరవింద్‌, మంగళి సంజయ్‌ ఎంపికై నట్లు పీఈటీ చిన్నయ్య బుధవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులను సర్పంచ్‌ శేఖర్‌, హెడ్‌ మాస్టర్‌ చంద్ర శేఖర్‌, ఉపాద్యాయులు, వీడీసీ సభ్యులు అభినందించారు.

సంక్షిప్తం

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement