సమస్యలను పరిష్కరించే వారికే మా మద్దతు | Sakshi
Sakshi News home page

సమస్యలను పరిష్కరించే వారికే మా మద్దతు

Published Sun, Nov 12 2023 12:34 AM

- - Sakshi

ఇందల్వాయి: తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వారికే మద్దతు తెలుపుతామని దివ్యాంగులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో మండల దివ్యాంగుల సంఘం సభ్యులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఎన్నికల్లో మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఐదు వందల పైచిలుకు ఉంటాయని సంఘ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఇంతవరకు ఏ పార్టీ ప్రతినిధులు తమను సంప్రదించకపోవడం దివ్యాంగులను అవమానించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘ ప్రతినిధులు నవీన్‌, మహిపాల్‌, జమున పాల్గొన్నారు.

బీజేపీలోకి గెంట్యాల వెంకటేష్‌

సుభాష్‌నగర్‌: నగరానికి చెందిన బీఆర్‌ఎస్‌ నా యకుడు గెంట్యాల (బొట్టు) వెంకటేష్‌, సు మారు 300 మంది కార్యకర్తలు శనివారం బీజేపీలో చేరారు. వారికి అర్బన్‌ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా పార్టీ కండువాలు కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ధన్‌పాల్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పథకాలకు ఆకర్షితులై బీజేపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌లో నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, ప్ర జల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. వెంకటేష్‌ మాట్లాడుతూ తాను బీజేపీలోకి రావడం సొంతింటికి వచ్చినట్లు ఉందన్నారు. బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ గెలుపు కోసం నిరంతరం పని చేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పడిగెల వెంకటేష్‌, మె ట్టు విజయ్‌, భరత్‌ భూషణ్‌, పంచరెడ్డి శ్రీధర్‌, టెంట్‌హౌజ్‌ శ్రీనివాస్‌, మురళీ కృష్ణ, కంతెం శ్యామ్‌, బద్దం కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌కు

మాదిగ సంఘాల మద్దతు

డిచ్‌పల్లి: రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎ న్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవ ర్ధన్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తె లంగాణ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(టీఎమ్మార్పీఎస్‌) నాయకులు తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్‌, మాదిగ ఉపకులాల మహిళ జిల్లా అధ్యక్షురాలు పులింటి ఒక ప్రకటన విడుదల చేశారు. మాదిగ, మా దిగ ఉపకులాలు తమ అమూల్యమైన ఓటును బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు వేసి గెలిపిస్తామన్నారు. మాదిగ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

క్షత్రీయ పాఠశాలలో

‘అరణ్య’

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం చేపూర్‌లోని క్షత్రీయ పాఠశాలలో పూర్వప్రాథమిక విద్యార్థుల క్షత్రీయ అరణ్య అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో క్షత్రీయ విద్యాసంస్థల చైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రకృతి సంపదకు, ప్రకృతి అందానికి భార త దేశం నిలయమన్నారు. అటువంటి ప్రకృతి వనాన్ని బయట ప్రపంచంలోకి వెళ్ళి చూడలేక పోతున్న పూర్వ ప్రాథమిక విద్యార్థుల కోసం అరణ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయన్నారు. విద్యార్థుల అడవి జంతువుల వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. విద్యాసంస్థల కార్యదర్శి అల్జాపూర్‌ దేవేందర్‌, వైస్‌ చైర్మన్‌న్‌ అల్జాపూర్‌ లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్జాపూర్‌ గంగాధర్‌, ప్రిన్సిపల్‌ లక్ష్మీనరసింహస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సాధారణ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చు

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే సాధారణ పరిశీలకులు గౌతంసింగ్‌ (94250–63524)కు ఫిర్యాదు చేయవచ్చని రూరల్‌ రిటర్నింగ్‌ అధికారి రాజేంద్రకుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ భంగపర్చినా.. అక్రమంగా డబ్బుల పంపిణీ, మద్యపానం, గృహావసరాల వస్తువులు, ఇతర వస్తువులు పంపిణీ చేసినట్లు దృష్టికి వస్తే ఫోన్‌నెంబర్‌ ద్వారా తెలపాలని కోరారు. అలాగే నగరంలోని ఆర్‌ అండ్‌ బి అతిథిగృహంలో ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement