మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

Published Sat, Nov 18 2023 1:22 AM

- - Sakshi

ఆర్మూర్‌టౌన్‌: ఆలూర్‌ మండలంలోని దేగాం రోడ్డులో ఎకై ్సజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో మద్యం తరలిస్తున్న సిద్ధాపూర్‌ గ్రామానికి చెందిన విఠల్‌ను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ స్టీవెన్సన్‌ తెలిపారు. మద్యాన్ని, ఆటోను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీలో ఎస్సైలు గంగాధర్‌, ప్రమోద్‌, చైతన్య, చంద్రమౌళి, సిబ్బంది వికాస్‌గౌడ్‌, సందీప్‌, దేవీదాస్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

పాఠశాలల పరిశీలన

రుద్రూర్‌: కోటగిరిలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్‌ సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మందులు అందజేశారు. వంటశాలలను పరిశీలించారు. ప్రిన్సిపాల్స్‌ ఎండీ బషీరుద్దిన్‌, సవిత రాణి, ఏఎన్‌ఎం ప్రియదర్శిని, వైద్య సిబ్బంది జ్యోతి, శ్రీదేవి ఉన్నారు.

Advertisement
Advertisement