అయోధ్య రాముడి పాదుకలు దర్శించుకున్న భక్తులు | Sakshi
Sakshi News home page

అయోధ్య రాముడి పాదుకలు దర్శించుకున్న భక్తులు

Published Sun, Nov 19 2023 1:12 AM

- - Sakshi

నిజామాబాద్‌ సిటీ : అయోధ్య శ్రీరాముడి పాదుకలను దర్శించుకుని భక్తులు పులకరించిపోయారు. భక్తుల దర్శనార్థం రాముడి పా దుకలతో చేపట్టిన యాత్ర శుక్రవారం రాత్రి నిజామాబాద్‌కు చేరుకుంది. శనివారం ఉద యం నగరంలోని సుభాష్‌నగర్‌ రామాలయంలో ప్రధాన అర్చకుడు తులసీ మురళీధ రాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ రాముడి పాదుకలకు అభిషేకం, పూజలు చేశారు. పాదుకలను రెండేళ్లుగా దేశంలోని అన్ని ప్ర ముఖ రామాలయాల్లో తిప్పుతున్నట్లు చల్లా శ్రీనివాస్‌శాస్త్రి తెలిపారు. జనవరి 15న పా దుకలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు అందజేస్తామన్నారు. ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ సరళ మహేందర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షు డు శంకర్‌రెడ్డి, శోభ నవీన్‌రెడ్డి, శ్రీనివాస్‌రె డ్డి, గోదా దామోదర్‌రావు, గడిల రాములు, శివరాజ్‌, రాఘవాచార్యులు, సీహెచ్‌ ప్రభాకర్‌రెడ్డి, వైశాలి పాల్గొన్నారు.

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో గోపూజ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : గోపాష్టమి ప ర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నగ రంలోని గోల్‌హనుమాన్‌ మందిరంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో పూజలు చేశా రు. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ అర్బన్‌ ప్రభారీ, జిల్లా సహ కార్యదర్శి ధాత్రిక రమేష్‌ మాట్లా డుతూ గోపాష్టమి విశిష్టత తెలిపారు. శ్రీకృష్ణభగవానుడు మొదటిసారి గోవులను తో లుకెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వ స్తోందన్నారు. వీహెచ్‌పీ ఆవిర్భవించి 60 ఏ ళ్లు అయిన సందర్భంగా మూడు రోజుల పా టు పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నా రు. వీహెచ్‌పీ జిల్లా సహ కార్యదర్శి అరుణ్‌ రెడ్డి, జిల్లా కోశాధికారి నాంపల్లి శేఖర్‌, బజరంగ్‌దళ్‌ నగర అధ్యక్షుడు యెండల సాయిబాబు, గోల్‌ హనుమాన్‌ మందిర్‌ చైర్మన్‌ నీలగిరి రాజు, బంజరమేష్‌, శ్రీహరి, నరేష్‌గౌడ్‌, శ్యాం పాల్గొన్నారు.

భారత్‌ గెలవాలని హోమం

నిజామాబాద్‌ సిటీ : వన్‌ డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత జట్టు గెలవాలని క్రికెట్‌ అభిమానులు పూజలు, హోమాలు చేస్తున్నారు. శనివారం నగరంలోని మారుతినగర్‌లో బ్ర హ్మశ్రీ జోషి మధుసూదనశర్మ రుగ్వేద ఘనా పాటి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి చండీ హో మం నిర్వహించారు. జోషి శివతేజ శర్మ, శశికాంత్‌, గురుస్వామి మనోహర్‌ స్వామి, ప్రసాద్‌ స్వామి పాల్గొన్నారు.

హెచ్‌ఎంలకు నోటీసులు

ఖలీల్‌వాడి : జిల్లాలోని 228 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు డీఎస్‌ఈ, ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో అటెండెన్స్‌ నమోదు చేయలేదు. దీంతో డీఈవో దుర్గాప్రసాద్‌ శనివారం నోటీసులు జారీ చేశారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్పెషల్‌ ఆఫీసర్స్‌, ప్రిన్సిపాల్స్‌ ఈ నెల 21 వరకు డీఈవో కార్యాలయంలో వివరణ ఇవ్వాలన్నారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిజాంషుగర్స్‌ ఆస్తులు

కబళించేందుకు మరో కుట్ర

బోధన్‌ : నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ ప్రై వేట్‌ యాజమాన్యం అధీనంలో ఉన్న రూ. వేల కోట్ల ఆస్తులను కబళించేందుకు కుట్ర జరుగుతోందని కార్మికు సంఘాల నాయకులు ఆరోపించారు. ఫ్యాక్టరీకి ఉన్న బ్యాంక్‌ అప్పులు తీర్చేందుకు భూముల విక్రయానికి అనుమతి ఇవ్వాలని ప్రైవేట్‌ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. భూముల అమ్మకాల ద్వారా రూ. 2,500 కోట్ల సేకరణకు యాజమాన్యం ప్రయత్నిస్తోందంటున్నారు. శనివా రం షుగర్‌ ఫ్యాక్టరీ గేటు ఎదుట కార్మిక నాయకులు రవిశంకర్‌గౌడ్‌, ఉపేందర్‌, బాల క్రిష్ణ, భాస్కర్‌ మాట్లాడారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement