నా కట్టె కాలేది బాన్సువాడలోనే.. | Sakshi
Sakshi News home page

నా కట్టె కాలేది బాన్సువాడలోనే..

Published Tue, Nov 21 2023 1:16 AM

నెమ్లిలో మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి  - Sakshi

నస్రుల్లాబాద్‌: ‘బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు స్థానికేతరులు.. నేను స్థానికుడిని.. నేను చనిపోతే నా కట్టె కాలేది బాన్సువాడ నియోజకవర్గం పోచారం గ్రామంలోనే’ అని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నెమ్లి, దుర్కి, బస్వాయిపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు ప్రజలు బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నకు ధాన్యం పండించాలంటే పెట్టుబడి, కరెంటు, సాగునీరు, పండించిన ధాన్యం కొనడం జరగాలన్నారు. ఈ నాలుగు కేసీఆర్‌ పాలనతోనే సాధ్యం అవుతుందన్నారు. స్థానికంగా ఉండి ప్రజా సమస్యలను తీర్చడానికి పని చేస్తానన్నారు. అధికారం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ ప్రజా సేవ చేయడం గొప్ప వరమన్నారు. ప్రతి గ్రామంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సారి కూడా కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెర్క శ్రీనివాస్‌, ఎంపీపీ పాల్త్య విఠల్‌, సర్పంచ్‌ గంగమణి, శ్యామల, ఎంపీటీసీ నాయిని రాధ, డి శ్రీనివాస్‌యాదవ్‌, కిశోర్‌యాదవ్‌, మాజీద్‌ ఖాన్‌, ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌బాబు, అంజాగౌడ్‌, నారాయణ, శంకర్‌ పాల్గొన్నారు.

అధికారం శాశ్వతం కాదు..

ప్రజలకు దగ్గరగా ఉండాలి

బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

పోచారం శ్రీనివాస్‌రెడ్డి

స్వాగతం పలుకుతున్న ప్రజలు
1/1

స్వాగతం పలుకుతున్న ప్రజలు

Advertisement
Advertisement