రేవంత్‌, కవిత వ్యాపార భాగస్వాములు | Sakshi
Sakshi News home page

రేవంత్‌, కవిత వ్యాపార భాగస్వాములు

Published Wed, Nov 22 2023 1:22 AM

యువశక్తి విజయ సంకల్ప సభలో 
మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌ - Sakshi

బోధన్‌టౌన్‌(బోధన్‌): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత వ్యాపార భాగస్వాములని, కాంగ్రెస్‌ గెలిస్తే వారిద్దరూ కలిసి ఎన్డీఎస్‌ఎల్‌ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కంటే కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రే వంత్‌ రెడ్డి పెద్ద దొంగ అని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. పసుపు, చెరుకు పంటలను కాంగ్రెస్‌ నాశనం చేసిందని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని రమాకాంత్‌ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన యువశక్తి విజయ సంకల్పసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చక్కెర ఫ్యాక్టరీల పునఃప్రారంభం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమవుతుందని, బీజేపీకి ఓటువేసి చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించుకుందామని అన్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికే రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల్చేందుకే బరిలో దిగారని ఆరోపించారు. బోధన్‌ నియోజక వర్గంలో బీజేపీకి 1994 ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వచ్చాయని, ప్రస్తుతం మిమ్ముల్ని చూస్తుంటే ఈసారి బోధన్‌ గడ్డపై బీజేపీ గెలుపు ఖాయమని విశ్వాసం కలుగుతోందని యు వతనుద్దేశించి అన్నారు. బోధన్‌లో సాగుతున్న స తాయింపులు, కులరాజకీయాలకు స్వస్తి పలుకుదా మని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గెలిచినా, ఓడినా బోధన్‌కు రారన్నారు. బీసీల ను కాంగ్రెస్‌ అవమానించిందని, ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటుకూడా బీసీలకు ఇవ్వలేదని మండిపడ్డారు. 30ఏళ్ల ఉద్యమ ఆకాంక్షను గుర్తించి ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. మందకృష్ణమాదిగ చెప్పినట్లు బీసీల్లో మార్పు రావాలని, ఇకనైనా కండ్లు తెరవాలని కోరారు. బీజేపీ బీసీని సీఎంని చేస్తామని ప్రకటించిందన్నారు. అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పా ర్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, అ డ్లూరి శ్రీనివాస్‌, ప్రబారీలు నర్సింహారెడ్డి, రాంచర ణ్‌, నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీధర్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వినోద్‌, పట్టణ అధ్యక్షులు బాలరాజు, జిల్లా ప్రధానకార్యదర్శి సుధాకర్‌ చారి, శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసులోటి గోపీకిషన్‌, ఎమ్మార్పీఎస్‌ ప్రతినిధి దిలీప్‌ తదితరులున్నారు.

ఒక్కరూ పలకరించలే..

కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన డీఎస్‌ అనారోగ్యంతో ఉంటే కనీసం పలకరించడానికి రా హుల్‌ గాంధీ, ప్రియాంక రాలేదని, రాష్ట్రంలో గాలికి తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలేనన్నారు. సంచులు మోయడానికే రేవంత్‌ రెడ్డి పనిచేస్తారని ఆరోపించారు. ఎన్నికల్లో అ ర్వింద్‌ ఎక్కడ పోటీచేస్తే అక్కడ పోటీ చే స్తానని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్సీ కవిత కో రుట్లలో ఎందుకు పోటీ చేయట్లేదన్నారు.

కాంగ్రెస్‌ గెలిస్తే ఎన్డీఎస్‌ఎల్‌

భూములను అమ్ముకుంటారు

యువశక్తి విజయ సంకల్ప సభలో

ఎంపీ అర్వింద్‌

Advertisement
Advertisement