నిజామాబాద్‌ | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Published Fri, Nov 24 2023 2:22 AM

- - Sakshi

బాలుడి మృతిపై విచారణ

బాల్కొండలో చికిత్సకు డబ్బుల్లేక మృతి చెందిన బాలుడి ఘటనపై అర్మూర్‌ అసిస్టెంట్‌ సెష న్స్‌ జడ్జి నసీమా సుల్తానా విచారణ చేపట్టారు.

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం నుంచి చల్లటిగాలులు వీస్తాయి. రాత్రి చలితీవ్రత పెరుగుతుంది. పొగమంచు కురుస్తుంది.

‘వెరిట్‌’తో చెక్‌

ఎన్నికల తరుణంలో మద్యం అక్రమ సరఫరాను అరికట్టేందుకు ఎకై ్సజ్‌ శాఖ ‘వెరిట్‌’ పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది.

IIలో u

శుక్రవారం శ్రీ 24 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

నేడు అమిత్‌షా రాక

పెర్కిట్‌(ఆర్మూర్‌) : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవా రం ఆర్మూర్‌కు రానున్నారు. ఆర్మూర్‌ ము న్సిపల్‌ పరిధిలోని పె ర్కిట్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకు డు ఈటెల కూడా సభకు రానున్నారు.

రేపు బోధన్‌కు

రాహుల్‌గాంధీ..

బోధన్‌ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఈనెల 25న ఉదయ 11.30 గంటల కు బోధన్‌లో భారీ బహిరంగ సభకు రాహు ల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రానున్నారు. పట్టణ శివారులో నర్సాపూర్‌ క్రాసింగ్‌ వద్ద సభ నిర్వహణకు స్థలాన్ని గురువా రం సాయంత్రం సుదర్శన్‌ రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు పరిశీలించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌, పీసీసీ డెలిగే ట్‌ గంగాశంకర్‌, అంతిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్ర 4 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సభకు యూపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌ గడీ హాజరుకానున్నారు.

‘ఓట్‌ ఫ్రం హోం’లో గోప్యత పాటిస్తున్నాం

సుభాష్‌నగర్‌ : జిల్లాలోని అర్హులుగా గుర్తించిన వయోవృద్ధులు, దివ్యాంగ ఓటర్ల నుంచి ‘ఓట్‌ ఫ్రంహోం’లో భాగంగా ఓట్లు స్వీకరిస్తున్నామని ఈ ఓటింగ్‌ను గోప్యంగా ఉంచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. గురువారం ఇంటి నుంచి ఓ టు స్వీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగు లు 2,418 మంది ఇంటినుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 1,058 మంది ఓటేశారన్నారు. 24,25 తేదీల్లో దర ఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఓటును స్వీకరిస్తున్నారన్నారు.

నగరంలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో అభివాదం చేస్తున్న జేపీ నడ్డా, అర్బన్‌ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రూరల్‌ అభ్యర్థి కులాచారి దినేశ్‌, జిల్లాధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య

న్యూస్‌రీల్‌

1/5

2/5

3/5

ఆర్మూర్‌ పట్టణంలోని ఒకే ఇంట్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఐదుగురు
4/5

ఆర్మూర్‌ పట్టణంలోని ఒకే ఇంట్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఐదుగురు

5/5

Advertisement
Advertisement