గుణపాఠం చెప్పండి | Sakshi
Sakshi News home page

గుణపాఠం చెప్పండి

Published Sun, Nov 26 2023 1:52 AM

- - Sakshi

కేసీఆర్‌, రేవంత్‌లకు

సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్‌ : ‘బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వాళ్ల కుటుంబాల కోసమే పనిచేస్తాయి. తెలంగాణ కోసం వాళ్లు చేసిందేమీ లేదు. ఇప్పుడు కామారెడ్డి నుంచి ఆ పార్టీల ముఖ్యనాయకులు సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. వారిని ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఇలాంటి అవకాశం మరెవరికీ దొరకదని, అది ఒక్క కామారెడ్డి ప్రజలకే దొరికిందని, కచ్చితంగా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. శనివారం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ఓటమి భయంతో వాళ్లిద్దరూ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఎంతో అన్యాయం చేసిందన్నారు. బీజేపీ మీద తెలంగాణ ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, వారి ఆశలను నెరవేర్చడానికి తాను అండగా ఉంటానన్నారు. కేసీఆర్‌ను డిసెంబర్‌ 3న ఇంటికి పంపించాలన్నారు.

భారీ బందోబస్తు

మోదీ సభ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు. అడుగడునా తనిఖీలు చేసారు. సభా ప్రాంగణం చుట్టూ ఉన్న కాలనీలో ఇండ్లపై కూడా పోలీసులు పహారగా ఉన్నారు. కేంద్ర బలగాలు, ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుల్‌లో భారీ బందోబస్తులో పాల్గొన్నారు.

కామారెడ్డి ప్రజలకు గొప్ప

అవకాశమొచ్చింది

ఓటమి భయంతోనే రెండు చోట్లా పోటీ చేస్తున్నారు

కామారెడ్డి సభలో ప్రధాని నరేంద్రమోదీ

సభ సక్సెస్‌తో బీజేపీ శ్రేణుల్లో జోష్‌

మార్మోగిన మోదీ నామస్మరణ

తెలంగాణకు చేసిందేమీ లేకపోగా.. వాళ్ల కుటుంబాల కోసమే పనిచేసే పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలను కామారెడ్డి ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. వేలాదిమంది జనం హాజరు కాగా ‘మోదీ’ నామస్మరణతో సభా ప్రాంగణం మోరుమోగింది.

జనసంద్రమైన సభ

సకల జనుల విజయ సంకల్ప సభ బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నిపింది. సభా ప్రాంగణం వేలాదిమంది జనంతో కిక్కిరిసి పోయింది. మోదీ రాక కోసం ఉదయం 11 గంటల నుంచే ఎదురుచూశారు. పీఎం రాకముందే నేతల ప్రసగంలో సైతం మోదీ నినాదాలు మార్మోగాయి. మధ్యాహ్నం 2.39 గంటలకు పీఎం సభకు హాజరయ్యారు. ఒక్కసారిగా సభా ప్రాగంణంలో పెద్ద ఎత్తున ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలతో జోష్‌ పెరిగింది. 35 నిమిషాల పాటు మోదీ ప్రసంగించారు. ఆయన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరును తనదైన శైలీ మాటలలో ఎండగట్టారు. బీఆర్‌ఎస్‌కు నీటి పారుదల ప్రాజెక్ట్‌లు ఏటీఎంలాగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోవద్దన్నా రు. సకలనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో, కామారెడ్డిలో అవి నీతి రహిత, రామరాజ్యం తెస్తానని అన్నా రు. రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. పదే పదే ‘నా కుటుంబ సభ్యుల్లారా’ అంటూ వాఖ్యనిస్తూ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. వెంకట రమణారెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

మోదీకి చిత్రపటం బహూకరిస్తున్న 
నాయకులు
1/2

మోదీకి చిత్రపటం బహూకరిస్తున్న నాయకులు

2/2

Advertisement
Advertisement