కేసీఆర్‌ గొంతు నొక్కాలని చూస్తున్నారు | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ గొంతు నొక్కాలని చూస్తున్నారు

Published Sun, Nov 26 2023 1:52 AM

రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ - Sakshi

నిజామాబాద్‌నాగారం : కేసీఆర్‌ గొంతు నొక్కాలని మోదీ, షా చూస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకీ బీజేపీని ఢీకొనే దమ్ము లేదని, అందుకే చాలా చోట్ల ఓడిపోయే అభ్యర్థులను పోటీలో ఉంచిందని కేటీఆర్‌ ఆరోపించారు. శనివారం సాయంత్రం నిజామాబాద్‌ నగరంలో ఖిల్లా చౌరస్తా నుంచి గోల్డెన్‌ జూబ్లీ స్కూల్‌ వరకు నిర్వహించిన రోడ్‌ షోలో అర్బన్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. రాహుల్‌గాంధీ మైనారిటీలు పేదలు అంటున్నారని మరి, అధికారంలో ఉన్నపుడు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో అన్ని మతాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌ మైనారిటీల సంక్షేమానికి 12,780 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.930 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్‌ అంటోందని కానీ తాము బీజేపీతో ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకే మేలు జరుగుతుందన్నారు.

మంత్రి కేటీఆర్‌

Advertisement
Advertisement