ఈవీఎంలలో భవితవ్యం | Sakshi
Sakshi News home page

ఈవీఎంలలో భవితవ్యం

Published Fri, Dec 1 2023 2:34 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు నువ్వా నేనా అనేవిధంగా ప్రచారం చేశారు. నామినేషన్ల ఘట్టం, సోషల్‌ ఇంజినీరింగ్‌, పోల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర వ్యవహారాల్లో బిజీబిజీగా గడిపారు. తాజాగా పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కావడంతో పోలింగ్‌ సరళి, ఆయా బూత్‌లవారీగా నమోదైన ఓట్ల వివరాలకు సంబంధించి, పోలింగ్‌ శాతం తదితర వివరాలతో కూడికలు, తీసివేతలపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పోటాపోటీగా త్రిముఖ పోరు నడిచింది. మూడోసారి అధికారం కోసం బీఆర్‌ఎస్‌, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ, తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో బీజేపీ భారీఎత్తున ప్రచారంతో పాటు ఎత్తులు పైఎత్తులు వేస్తూ పోరాడాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ఉమ్మడి జిల్లాలో మాత్రమే హోరాహోరి పోరు నడిచింది. దీంతో ఈనెల 3న వచ్చే ఉమ్మడి జిల్లా ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈనెల 3న ఓట్ల లెక్కంపు ప్రక్రియ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల విషయమై బెట్టింగ్‌ రాయుళ్లు జోరుగా బెట్టింగ్‌ నిర్వహిస్తుండడం గమనార్హం.

కామారెడ్డిలో పోరుపై..

జాతీయస్థాయిలో ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది మా త్రం కామారెడ్డి నియోజకవర్గమే. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ బరిలో నిలవగా పోటీగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఢీకొట్టారు. అయితే ఇక్కడ బీజేపీ నుంచి స్థానికంగా అత్యంత బలం, పట్టు కలిగిన అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లు పోరులో నిలిచారు. ప్రజాస్పందన కూడా భారీగా వచ్చింది. దీంతో ఏకంగా పీఎం మోదీ కామారెడ్డికి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. కామారెడ్డి బాద్‌షా ఎవరనేది అంచనాలకు అందని పరిస్థితి నెలకొంది.

అర్బన్‌లో ఉత్కంఠ

● ఉమ్మడి జిల్లా కేంద్రమైన అర్బన్‌ స్థానంలో సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ బరిలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. దీంతో ఈ ఫలితంపై ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది.

ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పైడి రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పొద్దుటూరి వినయ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్‌రెడ్డి ప్రచారంలో అందరికంటే ముందున్నారు. అయితే వినయ్‌రెడ్డి బలమైన అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ, రాకేశ్‌రెడ్డి అనూహ్యంగా పోలింగ్‌ సమయానికి ముందంజలోకి వచ్చారు. దీంతో ఫలితంపైనా ఉత్కంఠ నెలకొంది.

బాల్కొండలో అంచనాలకందని ఫలితం..

● బాల్కొండలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థి, మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ హోరాహోరీ తలపడ్డారు.

బాన్సువాడలో ఫలితంపై ఆసక్తి..

● బాన్సువాడ బరిలో బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు.

జుక్కల్‌లో పోటాపోటీగా..

● జుక్కల్‌ స్థానంలో సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌ షిండే, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార, కాంగ్రెస్‌ తరుపున లక్ష్మీకాంతరావు బరిలో ఉన్నారు. త్రిముఖ పోటీతో ఈ ఫలితంపైనా ఆసక్తి నెలకొంది.

నిజామాబాద్‌ రూరల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి, బీజేపీ నుంచి కులాచారి దినేశ్‌ బరిలో ఉన్నారు. ఈ ఫలితంపై జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

బోధన్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్‌, కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బీజేపీ నుంచి మోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు. కూడికలు, తీసివేతల నేపథ్యంలో ఈ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

ఎల్లారెడ్డిలో సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జాజాల సురేందర్‌, కాంగ్రెస్‌ నుంచి మదన్‌మోహన్‌, బీజేపీ నుంచి సుభాష్‌రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ టిక్కెట్టు దక్కకపోవడంతో సుభాష్‌రెడ్డి చివరి నిమిషంలో బీజేపీలో చేరి టిక్కెట్టు తెచ్చుకున్నారు.

కోటగల్లిలో ఓటు వేసిన 80 ఏళ్ల వృద్ధురాలు

పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌లో బస్సు దిగుతున్న ఎన్నికల సిబ్బంది

ఓటు వేస్తున్న ఎంపీ అర్వింద్‌

జడ్జి సునీత కుంచాల

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ

ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ శాతం

జిల్లాలో పోలింగ్‌ శాతం

దూపల్లిలో మొరాయించిన ఈవీఎం

రెంజల్‌ : మండలంలోని దూపల్లి 156వ బూ త్‌లో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు ఇ బ్బందులు పడ్డారు. ఈవీఎం అరగంట పాటు సతాయించడంతో పాటు అదే సమయంలో వర్షం పడటంతో పలువురు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దీనికి తోడు కరెంట్‌ లేక ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వ చ్చింది. చివరకు ఈవీఎం పనిచేయడంతో ఓ టర్లు లైట్ల వెలుతురులో రాత్రి ఏడు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌

చిన్న ఘటనలు మినహా..

ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూంలకు

తరలించిన యంత్రాంగం

సాయంత్రం 5 గంటల తర్వాత

క్యూలో ఉన్న ఓటర్లు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : శాసనసభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో పోలింగ్‌ శాతం 73.72గా నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 80.22 పోలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ ప్రక్రియ మొ దట్లో మందకొడిగా ప్రారంభమైనప్పటికీ తర్వా త పుంజుకుంది. పోలింగ్‌ ముగింపు సమయం 5 గంటలు దాటినప్పటికీ ఓటర్లు క్యూలో ఉన్నారు. అర్బన్‌ నియోజకవర్గంలో అత్య ల్పంగా పోలింగ్‌ నమోదైంది. 2018 ఎన్నికల్లో 62.65 శాతం పోలింగ్‌ నమోదు కాగా తాజా ఎన్నికల్లో 62.56 శాతం. అర్బన్‌ నియోజకవర్గంలోని 16, 17, 19, 41, 42 డివిజన్లలో పోలింగ్‌ కేంద్రాల వద్ద గుమిగూడడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. గంగాస్తాన్‌లోని పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసుల లాఠీచార్జ్‌లో బీజేపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఒక కార్యకర్త తలకు గాయమైంది. మహిళలను కూడా కొట్టడమేమిటని బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖిల్లా రోడ్డులోని అహ్మద్‌పుర కాలనీలో నేషనల్‌ హై స్కూల్‌ వద్ద దొంగ ఓటరు స్లిప్పులతో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్‌ పట్టణంలో విజయమేరి హైస్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా పోలీసులు చెదరగొ ట్టారు. బోధన్‌లోని గోసంబస్తీ ఏరియా వాసులు తమ ప్రాంతంలో అభివృద్ధి లేదని, ఓటే సేది లేదని చెప్పడంతో పోలీసు అధికారులు వెళ్లి సర్ది చెప్పి ఓట్లు వేసేలా చేశారు. ఆర్మూర్‌లోని కో టార్మూర్‌ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో సరిచేసి పోలింగ్‌ కొనసాగించారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి నాన్‌లోకల్‌ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. బా న్సువాడలోని వర్ని మండలం సిద్ధాపూర్‌ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డితో కాంగ్రెస్‌ కార్యకర్తలు గొడవ పెట్టుకున్నారు. బోధన్‌ ని యోజకవర్గంలోని రెంజల్‌ మండలం దూపల్లిలో ఈవీఎం మొరాయించడంతో క్యూలైన్‌లో ఉన్న కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

1/10

2/10

3/10

ఓటేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు
4/10

ఓటేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు

ఓటు వేసిన వృద్ధులు
5/10

ఓటు వేసిన వృద్ధులు

మొదటిసారి ఓటు వేసిన యువత
6/10

మొదటిసారి ఓటు వేసిన యువత

దూపల్లిలో చీకట్లో లైన్‌లో నిల్చున్న ఓటర్లు
7/10

దూపల్లిలో చీకట్లో లైన్‌లో నిల్చున్న ఓటర్లు

8/10

9/10

10/10

Advertisement
Advertisement