పీజీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు | Sakshi
Sakshi News home page

పీజీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

Published Wed, Dec 13 2023 12:12 AM

-

తెయూ: తెయూ పరిధిలోని పీజీ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తుదిగడువును ఈ నెల 15వరకు పొడిగించినట్లు కంట్రోలర్‌ అరుణ మంగళవారం తెలిపారు. పీజీ 3, 5, 7, 9వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల ఫీజును ఈ నెల 15వరకు, రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 18వరకు చెల్లించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంట్రోలర్‌ అరుణ కోరారు.

నేడు విద్యుత్‌ సమస్యల

పరిష్కార వేదిక

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదికను బుధవారం నిర్వహించనున్నట్లు డిచ్‌పల్లి ఏడీఈ శ్రీనివాస్‌ మంగళవారం తెలిపారు. డిచ్‌పల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి మండలాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వేదిక వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలని ఏడీఈ కోరారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వేదిక కొనసాగుతుందని అన్నారు.

20 నుంచి డిగ్రీ పరీక్షలు

తెయూ: తెయూ పరిధిలోని డిగ్రీ (బీఏ, బీకా, బీఎస్సీ, బీబీఏ) 1, 3, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 2, 4, 6వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు డిసెంబర్‌ 20 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ అరుణ మంగళవారం తెలిపారు. రిజిస్ట్రార్‌ యాదగిరి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు టీయూ వెబ్‌సైట్‌ణు సందర్శించాలని ఆమె కోరారు.

31 వరకు

పరీక్ష ఫీజు చెల్లించాలి

నిజామాబాద్‌అర్బన్‌: అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రీ ద్వితీయ, తృతీయ పరీక్షలకు ఈ నెల 31 వర కు అపరాధ రుసుము రూ. 500తో వార్షిక పరీ క్ష ఫీజు చెల్లించవచ్చని కో–ఆర్డినేటర్‌ రంజిత తెలిపారు. అలాగే పీజీ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు 16వరకు రూ.500 అపరాధ రు సుంతో చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 73829296 12 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement