మరో మహిళతో ఉన్న భర్తను పట్టుకున్న భార్య | Sakshi
Sakshi News home page

మరో మహిళతో ఉన్న భర్తను పట్టుకున్న భార్య

Published Tue, Dec 19 2023 1:12 AM

- - Sakshi

బాన్సువాడ :తన భర్త మరో మహిళతో కలిసి ఓ లా డ్జీలో ఉన్న విషయం తెలుసుకున్న భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన సోమవారం బాన్సువాడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పిట్లం మండల కేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఓ వివాహితను బాన్సువాడ పట్టణంలోని ఓ లాడ్జీకి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న ఇస్మాయిల్‌ భార్య పోలీసులను వెంట పెట్టుకుని లాడ్జీకి వెళ్లింది. ఇస్మాయిల్‌తోపాటు సదరు మహిళను పోలీసులకు అప్పగించింది. పోలీసులు ఇరువురిని పోలీస్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement