మార్గదర్శకాలు వస్తేనే స్పష్టత | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాలు వస్తేనే స్పష్టత

Published Sun, Feb 11 2024 1:02 AM

-

మోర్తాడ్‌(బాల్కొండ): బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.19,746 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నా రు. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తేనే రైతుల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్యా వ్యక్తమవుతున్నది. తాము అధికారంలోకి వస్తే రూ.2లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. రుణమాఫీ కోసం జిల్లాకు కనీసం రూ.వెయ్యి కోట్లకుపైగా నిధు లు అవసరమవుతాయి. వ్యవసాయశాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రైతుభరోసా, యాంత్రీకరణకు సరిపోతాయని, రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన రుణమాఫీ ఫలం అందాలంటే రైతులు మరికొంత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీకి విధివిధానాలను రూపొందించి కార్యాచరణ మొదలుపెడతామని భట్టి విక్రమార్క చెప్ప డం చూస్తుంటే.. మార్గదర్శకాలను జారీ చేసే వరకు రుణమాఫీపై స్పష్టత వచ్చేలా లేదు.

రూ.2లక్షల రుణమాఫీ కోసం రైతులకు తప్పని నిరీక్షణ

Advertisement
Advertisement