ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ

Published Sun, Apr 7 2024 1:40 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌: భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివా రం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో పార్టీ జెండా ను ఆవిష్కరించి స్వీట్లు పంచిపెట్టారు. దినేశ్‌ మా ట్లాడుతూ.. కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తోందన్నారు. మైనార్టీ, ఎస్సీ, ఆదివాసీ గిరిజనులను రాష్ట్రపతులను చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. బడుగు బలహీనవర్గానికి చెందిన ప్రధాని మోదీ మంత్రివర్గంలో 27 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, 15 మంది ఎస్సీలకు చోటు కల్పించారన్నారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడం, మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఎంపీ అర్వింద్‌ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పార్లమెంట్‌ ప్రభారీ వెంకటరమ ణి, నాయకులు గద్దె భూమన్న, న్యాలం రాజు, లక్ష్మీనారాయ ణ, స్రవంతిరెడ్డి, బద్ధం కిషన్‌, పంచరెడ్డి ప్రవళిక, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement