నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్‌ గురూజీ | Sakshi
Sakshi News home page

నాటా మహాసభల్లో ప్రసంగించిన శ్రీ రవిశంకర్‌ గురూజీ

Published Mon, Jul 3 2023 3:38 PM

Gurudev Sri Ravi Shankar Exclusive Interview On NATA Convention 2023 - Sakshi

నార్త్ అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ నాటా తెలుగు మహాసభలు డల్లాస్‌లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఈ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్‌ గురూజీ హాజరయ్యారు. మహాసభల్లో ఆయన మెడిటేషన్‌పై ప్రసంగించనున్నట్లు నాటా మహాసభల ఆధ్యాత్మిక కమిటీ చైర్‌ సుధాకర్‌ పెన్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు.

వాషింగ్టన్‌ డీసీలో జరగుతున్న నాటా తెలుగు మహాసభలకు రావడం మొదటిసారిగా వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు అని ప్రశ్నించగా..ఇది మొదటిసారి కాదని, న్యూఢిల్లీ, జర్మనీలో బెర్లిన్‌ తదితర కార్యక్రమాల్లో హాజయరయ్యానని చెప్పారు. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్‌ అయ్యిన వాళ్లందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చింది 'నాటా' అన్నారు. ఇది ఒకరకంగా మనమంతా ఒకే కుటుంబం అనే ఒక గొప్ప సందేశం ఇచ్చిందన్నారు. మన నేపథ్య ఏదైనా.. మనమంతా ఎప్పటికీ ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఎలుగెత్తి చాటారు. మొన్నటివరకు కోవిడ్‌ భయంతో డిప్రెషన్‌గా బిక్కుబిక్కుమంటూ నాలుగోడలకే పరిమితమైన అనంతరం ఆనందంగా నూతనోత్సహంతో జరుపుకుంటున్న ఒక వేడుక ఇది అని అన్నారు.

అలాగే ప్రస్తుత టెక్నాలజీ ఆధ్యాత్మిక జీవనానికి ఉపకరించేదా భంగం కలిగించేదా అని ప్రశ్నించగా..మానవుని కంఫర్ట్‌ కోసమే కదా టెక్నాలజీ. దాన్ని మన జీవితాన్ని సుఖమయం చేసుకునేలా వాడుకోవడమనేది మన చేతుల్లోనే ఉంది. టెక్నాలజీ మనిషికి మంచే చేస్తుంది. ఉపయోగించే విధానంలోను ఉంది అంతా అని చమత్కారంగా చెప్పారు. మనం కాన్ఫిడెంట్‌గా ఎప్పుడూ ఉండగలం అని ప్రశ్నించగా.. మన మైండ్‌ క్లియర్‌గా ఉంటేనే అది సాధ్యం అని బదులిచ్చారు. మెడిటేషన్‌ అని సులభంగా చెప్పినంతా ఈజీ కాదు కదా చేయడం అని అడగగా..అదే కదా నా జాబ్‌ అని నవ్వుతూ జవాబిచ్చారు గురూజీ రవి శంకర్‌.

మంచి గైడెన్స్‌లో చేయడం నేర్చుకుంటే అది ఈజీగానే చేయొచ్చు అని అన్నారు. మానవత్వానికి అతిపెద​ ఛాలెంజ్‌ వివక్ష, స్టీరియో టైప్‌ థింకింగ్‌ , ఫాల్స్‌ మైండ్‌ తదితరాలని అన్నారు. ఆ దుర్గుణాలని దూరం చేసిమంచి వైపు తీసుకువెళ్లగలిగేది మెడిటేషన్‌ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాను నక్స్‌లైట్లను కలుసుకున్న సందర్భం గుర్తు చేసుకుంటూ..ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ బోర్డర్‌ల మధ్య ఉన్న నక్సల్స్‌ ప్రాంతానికి వెళ్లానని, అక్కడ వారు తమ గురువు కారల్‌ మార్క్స్‌ అని చెప్పారన్నారు. అది వారి ఓపెనియన్‌. అక్కడ వారు తాము ఎంత వివక్షతకు గురయ్యమో వివరించారు.

ఆ తర్వాత వారి చెప్పిందంతా ఓపికగా విన్నా. ఆ తర్వాత వారు నా ప్రసంగం విని నచ్చాక ..కాసేపు తనాతో కలిసి మెడిటేషన్‌ కూడా చేశారన్నారు. ఆ తర్వాత క్రమేణా వారి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. కొందరూ పూర్తి స్థాయిలో  మారారు కూడా. మెడిటేషన్‌కి చాలా పవర్‌ ఉందని, కుల, మత భేదాలతో సంబంధం ఉండదని ఎవ్వరైన చేయొచ్చు. చివరిగా నువ్వేంటీ? అనేది నీ అంతరంగమే నీకు బోధించేలా చేస్తుందని రవిశంకర్‌ అన్నారు. ఇలా డల్లాస్‌లో జరిగిన నాటా మహాసభలో మెడిటేషన్‌ , ప్రాణాయామాకి సంబంధించిన విషయాలను గురించి చెప్పారు. 

(చదవండి: నాటా మహాసభలో..అమెరికా వైస్సార్‌సీపీ సోషల్‌ మీడియా మీట్ అండ్ గ్రీట్)

Advertisement
Advertisement