జోగానీ బ్రదర్స్‌ కేసు : బిజినెస్‌ టైకూన్‌కి వేల కోట్ల షాక్‌! | Sakshi
Sakshi News home page

జోగానీ బ్రదర్స్‌ కేసు : బిజినెస్‌ టైకూన్‌కి వేల కోట్ల షాక్‌!

Published Sat, Mar 2 2024 11:42 AM

Indian tycoon in US told to pay Rs 2k crore to 4 brothers - Sakshi

గుజరాత్‌కు చెందిన జోగానీ బ్రదర్స్‌  కేసులో కీలక తీర్పు

నలుగురు అన్నదమ్ములకు  సుమారు 20  వేల కోట్లు చెల్లించాల్సిందే :  కోర్టు

భారతదేశానికి చెందిన ఐదుగురు సోదరుల మధ్య రెండు దశాబ్దాలుగా సాగిన జటిలమైన కుటుంబ  స్థిరాస్తి వివాదంలో  లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో నలుగురు తోబుట్టువులకు తీర్పునిచ్చింది.  బిజినెస్‌ టైకూన్‌ హరేష్ జోగాని తన నలుగురు సోదరులకు దాదాపు 20వేల కోట్ల రూపాయలు చెల్లించాలని  కోర్టు ఆదేశించింది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు కోర్టు ప్రకటించిన ఇదే అతిపెద్దనష్టపరిహారం  అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 

జోగాని వర్సెస్ జోగానిగా పాపులర్‌ అయిన 21 ఏళ్ల నాటి కేసును  విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. హరేష్ జోగానీపై, అతని సోదరులు శశికాంత్, రాజేష్, చేతన్ , శైలేష్ జోగానీఆస్తి పంపకాల విషయమై  సుదీర్ఘ భాగస్వామ్యాన్ని ఉల్లంఘించాడనే ఆరోపిస్తూ  కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఐదు నెలల విచారణ త తాజా 7 బిలియన్ డాలర్ల విలువైన తీర్పునిచ్చింది. సోదరులకు హరీష్‌ 2.5 బిలియన్ల డాలర్ల (రూ. 20 వేల కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని, వందల కోట్ల డాలర్ల విలువైన  దాదాపు 17,000 అపార్ట్‌మెంట్‌లతో కూడిన దక్షిణ కాలిఫోర్నియా  రియల్‌  ఎస్టేట్‌ ఆస్తిని వాటాల ప్రకారం విభజించాలని ఆదేశించింది. 

భారతదేశంలోని గుజరాత్‌కు చెందిన జోగాని కుటుంబం, ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ఉత్తర అమెరికాలో ప్రపంచ వజ్రాల వ్యాపారంతో రాణించింది. అలాగే శశికాంత్ లేదా "శశి" జోగాని 1969లో 22 ఏళ్ల వయస్సులో కాలిఫోర్నియాకు వెళ్లాడు. అక్కడ సొంతంగా రత్నాల వ్యాపారంలో సోలో సంస్థను ప్రారంభించి సక్సెస్‌ అయ్యాడు. అలాగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి  బాగా విస్తరించాడు కూడా. 

అయితే 1990ల ప్రారంభంలో మాంద్యం కారణంగా వీరు ఆస్తులు నష్టపోయారు. దీంతో పాటు  1994 నార్త్‌రిడ్జ్ భూకంపం సందర్భంగా  శశికి చెందిన భవనం ఒక దానిలో 16 మంది  చనిపోవడంతో ఇది మరింత ముదిరింది.  ఈ క్రమంలో శశికాంత్ తన సోదరులను బోర్డు లోకి తీసుకువచ్చి, వారిని తన సంస్థ భాగస్వాములుగా చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్హోల్డింగ్‌ ద్వారా దాదాపు 17,000 అపార్ట్‌మెంట్ యూనిట్లను నిర్మించారు. దీని తర్వాతే వివాదం  మొదలైంది. హరేష్ మేనేజ్‌మెంట్ నుండి తనను బలవంతంగా తొలగించి, తమకు  రావాల్సిన దానిని అడ్డు కున్నాడని 2003లో శశి జోగాని ఫిర్యాదు చేశాడు.

అయితే రాతపూర్వక  భాగస్వామ్యం ఏదీ లేదని హరేష్ జోగాని వాదించాడు. విచారణ తర్వాత హరేష్ మౌఖిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు జ్యూరీ గుర్తించింది. 170కి పైగా అపార్ట్‌మెంట్ భవనాలున్న పోర్ట్‌ఫోలియోకు హరేష్ జోగాని ఏకైక యజమాని కాదని,  ఇందులో  శశికాంత్(72) కు  50 శాతం , హరేష్ 24 శాతం, రాజేష్ 10 శాతం, శైలేష్ 9.5 శాతం, చేతన్ 6.5 శాతం వాటాలు ఉన్నట్టు జ్యూరీ నిర్ధారించింది.  ఇంకా చర్చలు జరుపుతున్నందున,ప్రతివాది హరేష్ జోగాని తరపు న్యాయవాది రిక్ రిచ్‌మండ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినట్టు సమాచారం.

Advertisement
Advertisement