వైభవంగా టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 | Sakshi
Sakshi News home page

వైభవంగా టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024

Published Thu, Feb 22 2024 11:56 AM

Texas Thyagaraja Aradhana 2024 In USA - Sakshi

టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 అమెరికాలో వైభవంగా జరిగింది. అలెన్‌లోని రాధా కృష్ణ టెంపుల్‌లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు కలిసి త్యాగరాజ స్వామి రచించిన ఘన రాగ పంచరత్న కృతులను, గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసులను రంజింప చేశారు.

పంతుల రమ త్యాగరాజ స్వామికి గళార్చన చేసి.. తన గ్రాతంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఎఎస్‌ఎన్‌ మూర్తి, పత్రి సతీష్ కుమార్‌, గురువులు, విద్యార్థులచే వయోలిన్, గాత్ర కచేరీ కార్యక్రమం వీనులవిందుగా కొనసాగింది. సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సంగీత అభిమానులు కొనియాడారు. త్యాగరాజ కీర్తనలు భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి అని తెలిపారు. టెక్సాస్‌లోని ఇండియన్ ఆక్టేవ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

(చదవండి:  జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!)

Advertisement
Advertisement