సింగపూర్ లో దిగ్విజయంగా ప్రారంభమైన "శ్రీమద్ భాగవత సప్తాహం" | Sakshi
Sakshi News home page

సింగపూర్ లో దిగ్విజయంగా ప్రారంభమైన "శ్రీమద్ భాగవత సప్తాహం"

Published Mon, Apr 4 2022 2:46 PM

Ugadi Celebrations In Singapore By Sri Sankrithika Sarathi - Sakshi

సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలోఅంతర్జాల వేదికపై నిర్వహిస్తోన్న "శ్రీమద్ భాగవత సప్తాహం" కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. 

అవధాన సామ్రాట్ డాక్టర్‌ మేడసాని మోహన్ ఆధ్వర్యంలో భాగవత ప్రవచన  కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. శృంగేరి పీఠాధిపతులు విధుశేఖరానంద భారతి స్వామి, కుర్తాళం పీఠాధిపతిలు సిద్దేశ్వరానంద భారతి స్వామిలు శుభాకాంక్షలు వీడియో సందేశం రూపంలో అందించారు, ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొన్నారు. 

బీజేపీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి,  రాజు వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డాక్టర్‌ వంశీ రామరాజు, అమెరికా నుండి మల్లిక్ పుచ్చా, ఆస్ట్రేలియా నుండి విజయ తంగిరాల, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, థాయిలాండ్ నుంచి రవికుమార్ బొబ్బ, మలేషియా నుండి డా అచ్చయ్య రావు, సౌదీ అరేబియా నుండి దీపిక రావి తదితరులు, భారత్ నుండి తెలుగు భాగవత ప్రచార సమితి అధ్యక్షుడు ఊలపల్లి సాంబశివరావు దంపతులు మరియు వివిధ దేశాల తెలుగు ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement