వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.. ఉగాది ఉత్తమ రచనల పోటీ | Sakshi
Sakshi News home page

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.. ఉగాది ఉత్తమ రచనల పోటీ

Published Wed, Mar 9 2022 1:59 PM

Vanguri Foundation Ugaadi Uttam Rachanala Poteelu - Sakshi

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ  నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి. ప్రధాన విభాగంలో భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుంచి అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నారు. కథలు, కవితల విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చు. బహుమతిగా 116 డాలర్లు అందిస్తారు. 

యూనికోడ్‌
ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించాలి. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. చేతివ్రాతలో  కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదిస్తారు.  తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.

ఏప్రిల్‌ 1న
విజేతల వివరాలు 2022 ఏప్రిల్‌ 1న  ఉగాది పండుగ రోజు లేదా అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం. 2022 మార్చి 15లోగా ఎంట్రీలు పంపాలి. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణ కి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.  ఆసక్తి ఉన్న వారు తమ రచనలను sairacha@gmail.com, vangurifoundation@gmail.com ఈమెయల్‌ చేయగలరు.

Advertisement
Advertisement