ఆస్ట్రేలియాలో సిద్ధం : ఘనంగా యాత్ర ర్యాలీ!

10 Feb, 2024 18:01 IST|Sakshi

ఆస్ట్రేలియాలో యాత్ర 2 విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. రాబోయే రాజకీయ యుద్ధానికి మేం సిద్ధమంటూ పలువురు ప్రవాసాంధ్రులు నినదించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ జీవన ప్రయాణాన్ని దర్శకుడు మహి వి రాఘవ రూపొందించిన యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా.. ఆస్ట్రేలియా భారీ కారు ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం అని తెలియచేసారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో అభిమానులు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో భారీ కార్ల ర్యాలీలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి తమవంతు సహాయ సహకారాలు అందించటానికి వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా టీం రెడీగా ఉందని తెలియచేసారు.

|

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega