అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Published Fri, Dec 15 2023 1:32 AM

- - Sakshi

రామవరప్పాడు(గన్నవరం): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడు రైవస్‌ కాలువ సమీపంలోని ఖాళీ స్థలంలో గురువారం శ్రీ కృష్ణుడి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాగేశ్వరరావు, ఎంపీ బీద మస్తాన్‌రావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీమోహన్‌ అనువైన స్థలం కేటాయిం చేందుకు కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ములాయం సింగ్‌ యాదవ్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కేసరపల్లిలో స్థలం కేటాయించారన్నారు. త్వరలో జరగనున్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా సుమారు లక్ష మందితో బీసీ మహా బహి రంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో అనువైన స్థలం కేటా యిస్తే బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయింపునకు కృషి చేస్తానన్నారు. బీసీలంతా సీఎం వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ మాట్లాడుతూ రెండు సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో సేవ చేయగలిగానంటే ఈ గ్రామం ప్రధాన పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ సువర్ణరాజు, సర్పంచ్‌ వరి శ్రీదేవి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, మాజీ ఎంపీపీ యర్కారెడ్డి నాగిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు శీలం రంగారావు, ఎనికేపాడు సర్పంచ్‌ రాచమళ్ల పూర్ణచంద్రరావు, కాపు, యాదవ సంఘ నాయకులు, పలు గ్రామాల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

రెండు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీ కృష్ణుడి ఆలయ శంకుస్థాపన అనంతరం రామవరప్పాడులో మరో రెండు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే వంశీ మోహన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో వంగవీటి మోహన రంగారావు కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి, ఫ్లై ఓవర్‌ సమీపంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన త్వరలో లక్ష మందితో బీసీ మహా బహిరంగసభ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Advertisement
Advertisement